ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

పట్టాదారు పాస్ బుకులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని చెప్పారు. నారావారిపల్లెలో మాట్లాడిన ఆయన…2027 నాటికి రెవెన్యూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Published on: Jan 16, 2026, 09:26:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2027 నాటికి రెవెన్యూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని ప్రకటించారు. జాయింట్ కలెక్టర్లు ఈ రెవెన్యూ సమస్యలపైనే ఈ ఏడాది మొత్తం పని చేస్తారని చెప్పుకొచ్చారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వంలో ఇష్టం లేని వారి భూములు 22ఏలో పెట్టారని… గందరగోళం సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.కానీ తాము ఏడాది టార్గెట్ పెట్టుకుని సర్వే పూర్తి చేసి రూపాయి కూడా లేకుండా క్యూఆర్ కోడ్ తో పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. 2027 నాటికి రెవెన్యూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని ఉద్ఘాటించారు.

పర్యాటకంలో భాగంగా తిరుపతి, రూరల్ ప్రాంతంలో హోం స్టేలకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన…. తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్, విశాఖకు బీచ్ కు ప్రసిద్ధి అని చెప్పారు. తిరుపతి రాబోయే రోజుల్లో వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్ గా మారుతుందన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతిని మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

“జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదు. ప్రభుత్వ పాలసీలతో చదవుకుని ఉన్నత స్థితికి చేరుకున్నవారుఉన్నారు. అయినా చాలామందిలో జీవన ప్రమాణాలు లేవు. పీ4 లోభాగంగా మార్గదర్శి, బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా పేదరికం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తేనే నిజమైన సమసమాజం అవుతుంది. అందుకే పీ4 తీసుకొచ్చి 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నాం. 2026లో దీనిపై మరింత ఫోకస్ పెడతాం. ఒక్క డబ్బే కాదు...మేనేజ్మెంట్ స్కిల్ కావాలి” అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

“స్వర్ణ నారావారిపల్లెకు గతేడాది శ్రీకారం చుట్టాం. ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచాలని స్టార్ట్ చేశాం. రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామపురం 3 పంచాయతీలను పైలట్ గా తీసుకున్నాం. స్పెషల్ ఆఫీసర్‌ను పెట్టుకుని గ్రామాల్లో ఏం చేయాలో చేస్తున్నాం. మరుగుదొడ్లు, దీపం, పింఛన్లు అందిస్తున్నాం. ఇల్లు లేని వారిని గుర్తించాం. రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాం. రంగంపేటను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తాం. చెత్తను వంద శాతం సేకరించి శాగ్రిగేషన్ చేస్తున్నాం. తడి చెత్త నుంచి కంపోస్ట్, పొడి చెత్తను సర్య్కులర్ ఎకానమీకి పంపుతున్నాం” అని పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More