2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతగా భావిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామినీడులో ‘2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట భారీ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు…. మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టడమే కాకుండా, ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టేలా సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ లతో కలిసి నాడు ఇచ్చిన పిలుపును గౌరవించి 57 శాతం ఓట్ షేర్, 164 సీట్లతో ఎన్డీఏ కూటమిని గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని ప్రతిజ్ఞ చేశారు.
వైసీపీపై ఫైర్….
2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన గత ప్రభుత్వ అరాచక పాలన రూ.10 లక్షల కోట్ల అప్పులతో ముగిసిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. "గత పాలకులు ఎమ్మార్వో ఆఫీసులు, ఆసుపత్రులు, చివరకు మద్యం ద్వారా వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారు. యావత్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఆ గొడ్డలి పార్టీకి రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు," అని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.
మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి, రాష్ట్ర రాజధానిని ‘మావిగనో.. వాటికనో’ అన్నట్లు మార్చేసిన వైసీపీ తీరును సీఎం ఎద్దేవా చేశారు. తాము అమరావతి, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు.
కేవలం 36 రోజుల్లోనే రాయలసీమలోని పుట్టపర్తికి ఐదో జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని….. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గని తవ్వకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు వస్తుంటే, అమరావతికి ప్రతిష్టాత్మక ‘క్వాంటం వ్యాలీ’ వస్తోందని వెల్లడించారు.
{{/usCountry}}కేవలం 36 రోజుల్లోనే రాయలసీమలోని పుట్టపర్తికి ఐదో జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని….. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గని తవ్వకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు వస్తుంటే, అమరావతికి ప్రతిష్టాత్మక ‘క్వాంటం వ్యాలీ’ వస్తోందని వెల్లడించారు.
{{/usCountry}}పాలనా సౌలభ్యం కోసం అడ్డగోలు జిల్లాల విభజనను సరిచేసి మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, రీసర్వే ద్వారా శెట్టిపల్లి లాంటి దశాబ్దాల నాటి భూ వివాదాలను పరిష్కరించామన్నారు. ప్రజలపై రూ.4,668 కోట్ల భారాన్ని మోపకుండా, తొలిసారి ట్రూ డౌన్ (True Down) విధానం ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జే-బ్రాండ్ మద్యంతో మహిళల మంగళసూత్రాలు తెంచిన వైసీపీ…. సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ అంటూ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
"కూటమిది ఎల్లప్పుడూ పాజిటివ్ పాలిటిక్స్.. కానీ గొడ్డలి పార్టీది పాయిజన్ పాలిటిక్స్. ఎమ్మెల్యేలు ప్రజా సేవకులు మాత్రమే కానీ, పెత్తందారులు కాదు. ఎవరు తప్పు చేసినా…. ఎంతటి వారైనా వదిలిపెట్టను," అని ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. త్వరలోనే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడుగడుగునా అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి చేయూతనిస్తోందన్నారు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న మోదీని చంద్రబాబు అభినందించారు. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి చేసిన ఘనత ప్రధానిదన్నారు. 1.46 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారులు, 160 ఎయిర్‌పోర్టుల నిర్మాణం, చంద్రయాన్, గగన్‌యాన్ విజయాలు భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచాయని కొనియాడారు.