Bihar election results : విజయంవైపు దూసుకెళుతున్న ఎన్డీఏ- కనిపించని పీకే ప్రభావం!

బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపువైపు దూసుకెళుతోంది. మెజారిటీ మార్క్​ని దాటేసింది. విపక్ష పార్టీలేవీ ఎన్డీఏకి దగ్గరిలో కూడా లేవు.

Published on: Nov 14, 2025, 09:30:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేసినట్టుగానే బీహార్​ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపువైపు దూసుకెళుతోంది! శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన బీహార్​ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యంతో విజయంవైపు అడుగులు వేస్తోంది. ఎన్డీఏతో పోల్చితే విపక్ష మహాఘటబంధన్ చాలా​ వెనకజంలో ఉంది. ప్రశాంత కిశోర్​కి చెందిన జన్​ సురాజ్​ పార్టీ బీహార్​ ప్రజలను మెప్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎన్నికల ఫలితాల ట్రెండ్స్​ చూస్తుంటే స్పష్టమవుతోంది.

మెజారిటీ మార్క్​ వైపు దూసుకెళుతున్న ఎన్డీఏ (PTI)
మెజారిటీ మార్క్​ వైపు దూసుకెళుతున్న ఎన్డీఏ (PTI)

బీహార్​ ఎన్నికల ఫలితాలు- మెజారిటీ మార్క్ దాటేసిన ఎన్డీఏ..

బీహార్​ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్​ 122. ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు ఉన్న డేటా ప్రకారం..

  • ఎన్డీఏ- 142 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది.
  • మహాఘటబంధన్​- 66 స్థానాల్లో ముందంజలో ఉంది.
  • జేఎస్పీ- కేవలం 3 సీట్లల్లో మాత్రమే లీడింగ్​లో కొనసాగుతోంది.
  • ఇతరులు- 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

బీహార్​ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్​ అప్​డేట్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జేడీయూతో కూడిన ఎన్డీఏ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేసిన విషయం తెలిసిందే.

బీహార్​ ఎన్నికల ఫలితాలు 2025- పార్టీల వారీగా..

ఎన్డీఏ కూటమిలో బీజేపీ 76 సీట్లో ఆధిక్యంలో ఉంది. సీఎం నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని జేడీయూ 63 చోట్ల ముందంజలో ఉంది. మరోవైపు మహాఘటబంధన్​లో కీలకమైన, తేజస్వీ యాదవ్​కి చెందిన ఆర్జేడీ 60 సీట్లల్లో లీడింగ్​లో ఉంది. వాస్తవానికి ఎన్డీఏకి అత్యధిక సీట్లు లభిస్తున్నప్పటికీ, ఒకానొక సమయంలో ఆర్జేడీ ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండి అతిపెద్ద పార్టీగా కొనసాగింది. ఆ తర్వాత చాలా సీట్లల్లో బీజేపీ ముందుకు కదిలింది.

మరోవైపు మహాఘటబంధన్​లో మరో కీలక పార్టీ కాంగ్రెస్​ కేవలం 11 స్థానాల్లోనే లీడింగ్​లో కొనసాగుతోంది.

కనిపించని పీకే ప్రభావం..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​కి చెందిన జేెఎస్పీ.. తొలిసారి బీహార్​ ఎన్నికల బరిలో నిలిచింది. చాలా వరకు ఎగ్జిట్​ పోల్స్​ జేఎస్పీకి 5 సీట్ల కన్నా ఎక్కువ రావు అని తేల్చెశాయి. కాగా బీహార్​ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను చూస్తుంటే.. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలే నిజం అయ్యేలా కనిపిస్తోంది.

మొత్తం 243 సీట్లల్లో పోటీకి దిగిన జేఎస్పీ.. ఎన్డీఏ- మహాఘటబంధన్​కు తాము ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంది. కానీ అది బీహార్​ ప్రజలను ఆకట్టుకోలేదని స్పష్టమవుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More