...
...
Next Story

Cyclone Arnab Alert : అర్నబ్ తుపాన్ ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ నెంబర్లు

Cyclone Arnab Alert : అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపిస్తోంది. పలు జిల్లాల్లో దీని ప్రభావం ఉండటంతో అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేశారు

Published on: Oct 27, 2026, 16:23:22 IST
Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తీవ్ర తుపాను దూసుకొస్తుంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటనుంది. అత్యంత తీవ్ర తుపానుగా మారి గంటకు 125, 135 కిలోమీటర్లు, గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ కోసం అధికారులు కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేశారు.

సైక్లోన్ అర్నబ్ అప్డేట్స్
సైక్లోన్ అర్నబ్ అప్డేట్స్

అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 112 , 1070, 1800 4250101. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ స‌మ‌స్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు.

ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ల వివరాలు

1. శ్రీకాకుళం : 08942240557

2. విజయనగరం: 8922236947

3. పార్వతీపురం మన్యం : 08963450347

4. అల్లూరి సీతారామరాజు : 8935293448

5. విశాఖపట్నం: 0891-2590102 / 0891-2590100

6. అనకాపల్లి : 08924-222888 / 08924-226599 / 08924-225999

7. కాకినాడ: 0884-2356801 / 9849903879

8. కోనసీమ : 8856293104

9. తూర్పు గోదావరి : 8832944455

10. పశ్చిమ గోదావరి : 08816-299181

11. ఏలూరు: 18002331077 / 9494041419

12. పోలవరం : 18004254225

13. తిరుపతి : 0877 2236007

14. మార్కాపురం : 9248702500

15. కృష్ణా: 08672 252399

16. ఎన్టీఆర్ : 9154970454

18. బాపట్ల: 08643-220226

19. ప్రకాశం : 08592 295600 / 18004250277

20. నెల్లూరు : 7995576699

హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్

అర్నబ్ తుపాను నేపథ్యంలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను పరిస్థితులు, ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లతో సమీక్షించారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

టెలికాన్ఫరెన్స్‌లో ప్రధానంగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండటం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంపై హోంమంత్రి దృష్టి సారించారు. బలమైన గాలుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అవసరమైన చోట సహాయక చర్యలు వేగంగా చేపట్టేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

తుపాను సమయంలో ప్రజలకు సరైన సమాచారం చేరవేయడం అత్యంత ముఖ్యమని హోంమంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణలేని వార్తలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు జారీ చేసే అధికారిక సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నీటి ప్రవాహలపై మంత్రి నిమ్మల సమీక్ష

అర్నబ్ తుపాన్ నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్,అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బుధవారం అర్నబ్ తుపాను కోనసీమ మీదుగా తీరం దాటే అవకాశం ఉండటంతో ఇరిగేషన్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.

బుడమేరు, ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. బుడమేరు ఛానెల్‌లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. బుడమేరు ఛానెల్ నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏమైనా ఉంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. బుడమేరు ఛానెల్ లో ఇప్పటి వరకు ఎటువంటి తక్షణ చర్యలు చేపట్టారో వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల. తుపాన్ వల్ల ఏలేరు రిజర్వాయర్ కు వచ్చే వరదను అంచనా వేస్తూ, వాటర్ మేనేజ్మెంట్ చేయాలన్నారు. ఉత్తరాంధ్రలో నదులకు వచ్చే వరదను ముందస్తు అంచనా వేస్తూ, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలని, అర్నబ్ తుపాను వల్ల ఎటువంటి నష్టం జరగకుండా ఇరిగేషన్ శాఖ నుండి అన్ని ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks