రాబోయే తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తీవ్రమైన తుపాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీలలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మంత్రి సత్యకుమార్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సన్నద్ధతను సమీక్షించారు.

ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మందుల సరఫరా నిరంతరాయంగా కొనసాగించాల్సిన అవసరాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ నొక్కి చెప్పారు. అక్టోబర్ 23 నుండి నవంబర్ 6 మధ్య ప్రసవ తేదీలు ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులను ఆదేశించారు.
వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న 26,000 మందికి పైగా గర్భిణులను, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఆసుపత్రులలో చేర్పించడానికి ఆరోగ్య శాఖ గుర్తించింది. రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల నుండి గర్భిణులను తరలించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య అధికారులను మందులు, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇంట్రావీనస్ సెలైన్, ప్రసూతి మందులు, నవజాత శిశు సంరక్షణ సామాగ్రి, ఆక్సిజన్, జనరేటర్లు, ఇంధనం, తాగునీటి తగినంత నిల్వలు ఉండేలా చూడాలని ఆదేశించారు. గర్భిణులు, ప్రసవానంతర తల్లులు, నవజాత శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, క్రమం తప్పకుండా మందులు అవసరమయ్యే వారు ఉన్న కుటుంబాలను గుర్తించాలని ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలను కోరారు.
ప్రభావిత గ్రామాలలో సరైన పారిశుధ్యం, సురక్షితమైన తాగునీటి లభ్యతను చూసుకోవాలని ఉన్నతాధికారులు చెప్పారు. అలాగే అంటువ్యాధులు అసాధారణంగా పెరగకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించారు.
{{/usCountry}}ప్రభావిత గ్రామాలలో సరైన పారిశుధ్యం, సురక్షితమైన తాగునీటి లభ్యతను చూసుకోవాలని ఉన్నతాధికారులు చెప్పారు. అలాగే అంటువ్యాధులు అసాధారణంగా పెరగకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించారు.
{{/usCountry}}తీవ్ర వర్ష ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీలోని కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.