తిరుమల వెళ్లిన భక్తుల్లో చాలా మంది శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు తలనీలాలు ఇస్తారు. అయితే ఇందుకోసం ఎన్ని వేల బేడ్లు ఉపయోగిస్తారో తెలిసింది. ఓ సంస్థ టీటీడీకి బ్లేడ్లను విరాళంగా అందించింది. ఈ సందర్భంగా ఈ విషయం తెలిసింది.

హైదరాబాద్‌కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బ్లేడ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి రూ.1.16 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రోజుకు 40 వేల హాఫ్ బ్లేడ్లను కల్యాణకట్టల్లో వినియోగిస్తున్నామన్నారు. ఒక ఏడాదికి టీటీడీకి సరిపడా బ్లేడ్లను విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని దాత శ్రీధర్‌ను ఛైర్మన్ అభినందించారు.
ఈ సందర్భంగా దాత శ్రీధర్ బోడుపల్లి మాట్లాడుతూ.. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ తమదేనని అన్నారు. ఈ హాఫ్ బ్లేడ్ల వల్ల కల్యాణకట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ సంస్థ తయారు చేసిన బ్లేడ్లకు యూరప్, అమెరికాతో సహా 52 దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. 7ఓ క్లాక్ సంస్థ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియజేశారు.
టీటీడీకి రూ.60 లక్షలు విరాళం
టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన కె.యన్.నయన, వి.ప్రభా, రాజేష్, కె.యన్.రాజేష్, గుంటూరుకు చెందిన దేవరశెట్టి రితీష్, దేవరశెట్టి సత్యనారాయణలు వేర్వేరుగా రూ.10 లక్షల చొప్పున విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.
{{/usCountry}}టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన కె.యన్.నయన, వి.ప్రభా, రాజేష్, కె.యన్.రాజేష్, గుంటూరుకు చెందిన దేవరశెట్టి రితీష్, దేవరశెట్టి సత్యనారాయణలు వేర్వేరుగా రూ.10 లక్షల చొప్పున విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.
{{/usCountry}}