దేశంలోనే తొలిసారిగా పీ4 మోడల్‌లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం ప్రఖ్యాత గాంచిన డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి సవిత సమక్షంతో డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖాధికారులు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. బీసీలను అన్ని రంగాల్లోనూ ముందు ఉంచాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా బీసీల కులాల సంక్షేమానికి పలు పథకాలు అమలుచేస్తున్నారన్నారు. బీసీ యువత ఉన్నత స్థానాల్లో కొలువుదీరాలన్న ఉద్దేశంతో సివిల్స్ సర్వీసెస్, డీఎస్సీ, గ్రూప్ 1, పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల కోసం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు.
సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 మోడల్‌లో బీసీ యువతకు ఉచిత సివిల్స్ శిక్షణ అందించడానికి దేశంలో ప్రఖ్యాత గాంచిన డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ముందుకు రావడం అభినందనీయమన్నారు మంత్రి సవిత. ఈ సివిల్స్ శిక్షణ సందర్భంగా డాక్టర్ లక్ష్మయ్య అకాడమీ మెటీరియళ్లతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో వివిధ సబ్జెక్టులపై బోధన అందించనున్నారన్నారు.
2014-19లో బీసీ నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని మంత్రి సవిత గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఉచిత సివిల్స్ కోచింగ్ నిలిపేసిందన్నారు. దీంతో బీసీ నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పాలైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఉచిత సివిల్స్ కోచింగ్ ను పునరుద్ధించిందన్నారు. గడిచిన రెండేళ్లలో 200 మందికి ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేశామన్నారు. 2025 మెగా డీఎస్సీకి, గ్రూప్ 1కు కూడా ఉచిత శిక్షణ అందజేశామన్నారు. త్వరలో సివిల్స్ ఉచిత కోచింగ్ ప్రారంభించనున్నామన్నారు.
ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వంద మందికి ఉచిత వసతితో కూడిన శిక్షణ అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. డీఎస్సీ నోఫికేషన్ రాగానే ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణ అందజేయనున్నామన్నారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
{{/usCountry}}ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వంద మందికి ఉచిత వసతితో కూడిన శిక్షణ అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. డీఎస్సీ నోఫికేషన్ రాగానే ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణ అందజేయనున్నామన్నారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
{{/usCountry}}పీ4 ఫౌండేషన్ వైఎస్ చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ, ఉచిత సివిల్స్ కోచింగ్ మెయిన్స్‌కు ఎంపికైన బీసీ అభ్యర్థులకు రూ.రెండు లక్షల చొప్పున వ్యక్తిగతంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పీ4 విధానంలో బీసీలను అన్నిరంగాల్లోనూ ముందు ఉంచాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.
డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ చీఫ్ మెంటార్ లక్ష్మయ్య మాట్లాడుతూ, బీసీ విద్యార్థులకు సివిల్స్‌కు మెరుగైన శిక్షణ అందజేస్తామన్నారు. ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా కలిసి, వారికి శిక్షణ ఇస్తామన్నారు. ఏపీ గెజిటెడ్ జేఏసీ ఛైర్మన్ కేవీ కృష్ణయ్య మాట్లాడుతూ, తమ ఉద్యోగ సంఘ తరఫున పలువురు విద్యార్థులకు పీ4 విధానంలో సివిల్స్ కోచింగ్ అందజేస్తామని తెలిపారు. అంతకుముందు మంత్రి సవిత సమక్షంలో ఒప్పంద పత్రాలపై బీసీ సంక్షేమ శాఖ అధికారులు, డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ప్రతినిదులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.