...
...
Next Story

Tirupati Vande Bharat : శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. తిరుపతికి కొత్త వందే భారత్ ట్రైన్

Tirupati Vande Bharat Train : శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. తిరుపతికి మరో వందే భారత్ రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ దొరికింది.

Updated on: Sep 6, 2026, 17:52:15 IST
Advertisement

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ప్రయాణించే భక్తులకు, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ మైండ్ మంచి న్యూస్ అందించింది. తిరుపతి-శివమొగ్గ నగరాల మధ్య ప్రతిపాదించిన సరికొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుకు సంబంధించి రైల్వే బోర్డు నుంచి సానుకూల స్పందన లభించినట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తి వెల్లడించారు.

వందే భారత్ ట్రైన్
వందే భారత్ ట్రైన్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం కర్ణాటక వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. శివమెుగ్గ నుంచి ఎక్కువ మంది వస్తారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి రైల్వే స్టేషన్ మౌలిక వసతుల పెంపుతో పాటు, కర్ణాటకను కలుపుతూ కొత్త వందే భారత్ రైలును ప్రారంభించాలని ఎంపీ గురుమూర్తి రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈఓకు గతంలో వినతిపత్రం సమర్పించారు.

ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రైల్వే బోర్డు.. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. శివమొగ్గ టౌన్ నుంచి ఐటీ రాజధాని బెంగళూరు మీదుగా తిరుపతికి ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ప్రాథమిక ప్రతిపాదన రూపుదిద్దుకుందని రైల్వే శాఖ ఎంపీకి సమాచారం అందించింది.

ఈ నూతన రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక, విద్య, వైద్య, వ్యాపార రంగాలకు చెందిన వారికి ఎంతో లబ్ధి చేకూరనుంది. శివమొగ్గ, బెంగళూరు పరిసర ప్రాంతాల భక్తులు అతి తక్కువ సమయంలో సౌకర్యవంతంగా తిరుపతికి చేరుకోవచ్చు.

ఉద్యోగులు, వ్యాపారులకు బెంగళూరు-తిరుపతి మధ్య వేగవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తుంది. బెంగళూరు, తిరుపతిలలోని ప్రముఖ ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు వెళ్లేవారికి ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

వందే భారత్ ట్రైన్ ఇప్పుడు రాత్రివేళ ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ సర్వీసులను విస్తరించేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 260 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని సంకల్పించింది. ఈ స్లీపర్ సిరీస్‌లో తొలి రైలు గువాహాటీ-హౌరా మార్గంలో ఇప్పటికే ప్రయాణికులకు అందుబాటులోకి రాగా, రెండో రైలు ప్రస్తుతం పట్టాలపై ట్రయల్ రన్స్ పూర్తి చేసుకుంటోంది. ఈ రెండో రైలును బెంగళూరు - ముంబై మార్గంలో నడిపే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై రైల్వే శాఖ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ప్రస్తుతం సిద్ధమవుతున్న 16 కోచ్‌ల రైలులో 11 ఏసీ 3-టైర్, 4 ఏసీ 2-టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. రాత్రివేళ సుఖవంతమైన ప్రయాణం కోసం మెత్తటి బెర్త్‌లు, రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డిస్‌ప్లే బోర్డులు, సమాచారాన్ని అందించే స్పీకర్ వ్యవస్థలను అమర్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆటోమేటిక్ తలుపులు, కోచ్‌ల మధ్య శబ్దం రాకుండా ఉండేలా సీల్డ్ గ్యాంగ్‌వేలను ఏర్పాటు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe