గుంటూరు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాత్రివేళల్లో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని మెుదలుపెట్టారు. దీనిద్వారా డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారని, తద్వారా ప్రమాదాలు జరగవని భావిస్తున్నారు.

గుంటూరు పోలీస్ సూపరింటెండెంట్ వాకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, వాహనదారుల భద్రత కోసం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష పహారా, వాహన తనిఖీలను కూడా ముమ్మరం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు టోల్‌గేట్, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైవే పెట్రోల్ బృందాలు రాత్రి నుండి తెల్లవారుజాము వరకు నిరంతరంగా గస్తీ నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నాయి.
రాత్రిపూట ఎక్కువసేపు ప్రయాణించే లారీ, బస్సు, ఇతర వాహన డ్రైవర్లకు అలసట వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి పోలీసులు “ఆగు – కడుక్కో, వెళ్ళు(స్టాప్ – వాష్ అండ్ గో) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అంటే డ్రైవర్లు నిర్ణిత పార్కింగ్ స్థలంలో డ్రైవర్లు కొద్దిసేపు ఆగి, విశ్రాంతి తీసుకుని, నీటితో ముఖం కడుక్కొని, అప్రమత్తమైన తర్వాతే తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాలని సూచిస్తున్నారు. తర్వాత యాక్టివ్‌గా ఉంటారని చెబుతున్నారు.
అలసిపోయిన డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డు పక్కన ఆపకుండా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో లేదా సురక్షిత విశ్రాంతి కేంద్రాలలో మాత్రమే పార్క్ చేయాలని పోలీసులు కోరారు. హైవే పక్కన పార్కింగ్ చేయడం వల్ల ఇతర రహదారి వినియోగదారులకు తీవ్ర ప్రమాదం వాటిల్లవచ్చని హెచ్చరించారు.
అతివేగం, తప్పుడు మార్గంలో ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం, అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వంటి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
{{/usCountry}}అతివేగం, తప్పుడు మార్గంలో ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం, అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వంటి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
{{/usCountry}}