ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ కేంద్రం ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో నెలకొన్న అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశముంది.
ఎక్కడెక్కడ వర్ష సూచన ఉంది?
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల గురువారం భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. వీటితో పాటు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం నాటికి ఈ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శుక్రవారం కూడా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ పరిధిలో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
బలమైన ఈదురుగాలుల హెచ్చరిక
శనివారం రోజున కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ బలమైన ఉపరితల గాలుల ప్రభావం సెప్టెంబర్ 14 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొనసాగనుంది. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}ఈ బలమైన ఉపరితల గాలుల ప్రభావం సెప్టెంబర్ 14 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొనసాగనుంది. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచిస్తున్నారు.
{{/usCountry}}