...
...
Next Story

ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రయాణికులకు అలర్ట్.. రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లు

భారతీయ రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటోంది. ఇందులో భాగంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులు ఈ రైళ్లను ఉపయోగించుకోవచ్చు.

Published on: May 15, 2026, 09:55:23 IST
Advertisement

వేసవి రద్దీని తగ్గించడానికి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైలు నెం. 08581 విశాఖపట్నం-ఎస్ఎమ్‌వి బెంగళూరు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు మే 22 నుండి జూన్ 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 03.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, సాయంత్రం 04.02 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 01.50 గంటలకు ఎస్ఎమ్‌వి బెంగళూరు చేరుకుంటుంది(మొత్తం 6 ట్రిప్పులు).

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

తిరుగు ప్రయాణంలో 08582 నంబరు గల ఎస్ఎమ్‌‌వీ బెంగళూరు - విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, మే 23 నుండి జూన్ 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 03.50 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.28 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుండి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరి, మధ్యాహ్నం 13.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది(మొత్తం 06 ట్రిప్పులు).

ఇక కాచిగూడ-విశాఖపట్నం వన్ వే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు నెం. 07810, మే 15వ తేదీ శుక్రవారం రాత్రి 08.45 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు (శనివారం) ఉదయం 09.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

నాందేడ్ - నిజాముద్దీన్

వేసవి సెలవుల వేళ ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు, అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు వివిధ గమ్యస్థానాల మధ్య సమ్మర్ స్పెషల్ రైళ్లను భారతీయ రైల్వే నడుపుతోంది.

మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.

  • రైలు నంబర్ 07660: మే 22న (శుక్రవారం) ఉదయం 06:35 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి... మరుసటి రోజు (శనివారం) మధ్యాహ్నం 14:30 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 07661: తిరుగు ప్రయాణంలో మే 25న (సోమవారం) తెల్లవారుజామున 01:25 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 09:45 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.

దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, బలార్షా, నాగ్‌పూర్, రాణి కమలాపతి, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతాయి. ఇవి కూడా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో నడుస్తాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe