ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-విజయవాడ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 20న(ఆదివారం) ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గరుడ సేవ వేళ తిరుమల సందర్శించే భక్తులతో పాటు, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

తిరుపతి – విజయవాడ ప్రత్యేక రైలు (రైలు నం. 07606) సెప్టెంబర్ 20న తెల్లవారుజామున 1:15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. అదే రోజు ఉదయం 8:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
విజయవాడ – తిరుపతి ప్రత్యేక రైలు (రైలు నం. 07605) సెప్టెంబర్ 20న ఉదయం 9:00 గంటలకు విజయవాడ నుండి బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 4:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఈ ట్రైన్లు రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 16 - జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 04 - స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 02 - ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లు ఉంటాయి. తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తులు, వీకెండ్ ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకుని తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ప్రయాగ్‌రాజ్ - తిరునెల్వేలి స్పెషల్ ట్రైన్స్ వయా ఏపీ
రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని అనుసంధానిస్తూ ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి-ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా 4 ట్రిప్పుల చొప్పున ఈ రైళ్లు సర్వీసులను అందించనున్నాయి.
{{/usCountry}}రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని అనుసంధానిస్తూ ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి-ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా 4 ట్రిప్పుల చొప్పున ఈ రైళ్లు సర్వీసులను అందించనున్నాయి.
{{/usCountry}}ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి ప్రత్యేక రైలు(రైలు నంబరు: 04171) 19.09.2026 నుండి 10.10.2026 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. మెుత్తం 4 ట్రిప్పులు నడవనున్నాయి.
తిరునెల్వేలి – ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక రైలు (రైలు నంబరు: 04172) 21.09.2026 నుండి 12.10.2026 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. ఇది కూడా 4 ట్రిప్పులు ప్లాన్ చేశారు.
ఈ ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఏపీలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతుంది. ఇతర ముఖ్యమైన స్టేషన్లు చూసుకుంటే.. మాణికపూర్, సత్నా, కట్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగ్‌పూర్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, మదురై, ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.