2026 కేంద్ర బడ్జెట్ భారతదేశం అంతటా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది. ఇప్పుడు విజయవాడ టూ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్-ముంబై మధ్య 2 గంటల కంటే తక్కువ ప్రయాణ సమయంతో వెళ్లేలా బుల్లెట్ రైలును ప్రకటించింది. కారిడార్ ప్రారంభానికి అంచనా వేసిన సమయం ఆగస్టు, 2027.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ-విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టును పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం భూమి కోసం అన్వేషిస్తోంది. ఇది కాకుండా విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హై-స్పీడ్ రైలును ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్ లోకేషన్ సర్వే చేయడానికి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు వెళ్లాయి. మరోవైపు అమరావతి గుండా వెళ్ళే హైదరాబాద్-చెన్నై, కర్నూలు, అనంతపురం గుండా వెళ్ళే హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను, చిత్తూరు గుండా వెళ్ళే చెన్నై-బెంగళూరు కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు.
విజయవాడ-విశాఖ బుల్లెట్ రైల్ కారిడార్ 350 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఈ రైల్ అందుబాటులోకి వస్తే.. 2 గంటల్లోపే ప్రయాణం రెండు నగరాల మధ్య ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా వెళ్లి రావొచ్చు. అంతేకాదు.. హైదరాబాద్‌కు కూడా కనెక్టివిటీ పెరగనుంది. 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో బుల్లెట్ రైళ్లు ఈ రూట్‌లో పరుగులు పెడతాయి. ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా ఈ రూట్ ఉంటుంది.
రైలు కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధిపై సమానంగా దృష్టి సారిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ రైలు వస్తే అది పెద్ద ముందడుగు అవుతుంది.
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో అంతర్ నగర ప్రయాణాన్ని గణనీయంగా మారుస్తాయని గతంలోనే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. బెంగళూరు-చెన్నై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్‌ను డైమండ్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. హైస్పీడ్ కారిడార్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
{{/usCountry}}కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో అంతర్ నగర ప్రయాణాన్ని గణనీయంగా మారుస్తాయని గతంలోనే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. బెంగళూరు-చెన్నై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్‌ను డైమండ్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. హైస్పీడ్ కారిడార్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
{{/usCountry}}మరోవైపు బెంగళూరు-చెన్నై కారిడార్ ప్రయాణ సమయాన్ని కేవలం ఒక గంట 13 నిమిషాలకు తగ్గిస్తుందని అన్నారు. 'బెంగళూరు-చెన్నై ఒక విధంగా రెండు విలీన నగరాలుగా మారతాయి. రోజులో ఏ సమయంలోనైనా వెళ్లి రావొచ్చు. చెన్నైలో పని పూర్తి చేసి అదే రోజు బెంగళూరుకు తిరిగి రావచ్చు. అదేవిధంగా బెంగళూరు-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు మార్గం ప్రయాణ సమయం దాదాపు రెండు గంటలు మాత్రమే అవుతుంది.' అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
వైజాగ్-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు కంప్లీట్ అయితే ఈ నగరాలకు కూడా వేగంగా చేరుకోవచ్చు. విశాఖ నుంచి హైదరాబాద్, విశాఖ నుంచి చెన్నై, బెంగళూరులాంటి నగరాలకు ప్రయాణ సమయం తగ్గనుంది.