తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు, ఉత్తరాంధ్ర - కోస్తా ఆంధ్ర మధ్య ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, పెరిగిన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తిరుపతి - విశాఖపట్నం (08509/08510) మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో సాగర తీర నగరం విశాఖ నుంచి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి రాకపోకలు సాగించే వారికి సీట్ల కొరత సమస్య తీరనుంది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 11 వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ఇరు వైపులా వారానికి రెండు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 22 ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు అమర్చారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది.
తిరుపతి - విశాఖపట్నం (స్పెషల్ ట్రైన్ నం. 08509)
తిరుపతి నుంచి విశాఖ వైపు వెళ్లే ప్రయాణికులకు ఆగస్టు 16వ తేదీన తొలి సర్వీస్ ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 10 వరకు ఈ రైలు సేవలు కొనసాగుతాయి. ప్రతి ఆదివారం, గురువారం నడుస్తాయి. ఉదయం 09:50 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖపట్నం - తిరుపతి (స్పెషల్ ట్రైన్ నం. 08510)
విశాఖపట్నం నుంచి తిరుపతి దిశగా ప్రయాణించే శ్రీవారి భక్తుల కోసం ఆగస్టు 17 నుంచి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబరు 11 వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారం, శుక్రవారం నడుస్తాయి. రాత్రి 07:40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 06:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
రద్దీకి తగినట్లుగా ఈ రైలుకు మొత్తం 22 కోచ్‌లు కేటాయించారు. అన్ని వర్గాల ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఏసీ క్లాస్, స్లీపర్ క్లాస్‌తో పాటు సాధారణ ప్రయాణికుల కోసం జనరల్ బోగీలను పొందుపరిచారు. ముందస్తుగా ప్రయాణం ప్లాన్ చేసుకునే వారు ఐఆర్సీటీసీద్వారా ఆన్లైన్లో రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
మచిలీపట్నం - సాయి నగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
{{/usCountry}}రద్దీకి తగినట్లుగా ఈ రైలుకు మొత్తం 22 కోచ్‌లు కేటాయించారు. అన్ని వర్గాల ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఏసీ క్లాస్, స్లీపర్ క్లాస్‌తో పాటు సాధారణ ప్రయాణికుల కోసం జనరల్ బోగీలను పొందుపరిచారు. ముందస్తుగా ప్రయాణం ప్లాన్ చేసుకునే వారు ఐఆర్సీటీసీద్వారా ఆన్లైన్లో రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
మచిలీపట్నం - సాయి నగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
{{/usCountry}}ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతికి ప్రాధాన్యతనిస్తూ దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం-సాయి నగర్ షిరిడీ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు పాత సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో అత్యంత ఆధునికమైన, సురక్షితమైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విజయవాడ డివిజన్ సీపీఆర్వో అధికారికంగా ప్రకటించారు.
రైలు నంబర్ 17208 (మచిలీపట్నం – సాయి నగర్ షిరిడీ): 2026 ఆగస్టు 11వ తేదీ నుంచి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. రైలు నంబర్ 17207(సాయి నగర్ షిరిడీ – మచిలీపట్నం) 2026 ఆగస్టు 12వ తేదీ నుంచి నూతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో సేవలు అందిస్తుంది.
జర్మన్ సాంకేతికతతో రూపొందించిన ఈ కోచ్‌లు యాంటీ-టెలిస్కోపిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ప్రమాదాలు జరిగినా బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కవు లేదా బోల్తా పడవు. ఈ రైళ్లు గంటకు 120 నుండి 130 కిలోమీటర్ల వేగంతో సురక్షితంగా ప్రయాణించగలవు, దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది.