రాబోయే న్యూ ఇయర్ వేళ వైజాగ్, అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? అయితే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం నుంచి ప్యాకేజీ వచ్చేసింది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 1 జనవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.

ఐఆర్సీటీసీ టూరిజం ప్రకటనలోని వివరాల ప్రకారం…. “JEWEL OF EAST COAST” పేరుతో ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రోజులు టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. జర్నీ కంటే ముందే టికెట్లను బుకింగ్ చేసుకోవాలి.
హైదరాబాద్ అరకు టూర్ షెడ్యూల్ వివరాలు:
- డే 1: హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5.05 గంటల ట్రైన్(గోదావరి ఎక్స్ ప్రెస్) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- డే 2: మార్నింగ్ 5.55 గంటలకు విశాఖకు చేరుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. ఖాళీమాతా ఆలయాన్ని దర్శించుకుంటారు. సబ్ మెరైన్ మ్యూజియంను చూస్తారు. భోజనం తర్వాత… కైలాసగరి హిల్స్, రుషికొండ బీచ్ కు వెళ్తారు. రాత్రి విశాఖలోనే ఉంటారు.
- డే 3 : మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. అరకుకు వెళ్తారు. తైదా జంగల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియంను సందర్శిస్తారు. గాలికొండ వ్యూ పాయింట్,బొర్రా కేవ్స్ ను చూస్తారు. రాత్రి తిరిగి విశాఖకు చేరుకుంటారు.
- డే 4 : ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత సింహాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆర్కే బీచ్ వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు విశాఖ నుంచి తిరిగి ప్రయాణమవుతారు.
- డే 5 : ఉదయం 06:15 గంటలకు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేర్ కు రూ. 27,910, ట్విన్ షేరి్ంగ్ కు రూ. 17,010, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13,370గా నిర్ణయించారు.
{{/usCountry}}హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేర్ కు రూ. 27,910, ట్విన్ షేరి్ంగ్ కు రూ. 17,010, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13,370గా నిర్ణయించారు.
{{/usCountry}}స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 26,010, డబుల్ షేరింగ్ కు రూ. 15,110, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11,480గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 మొబైల్ నెంబర్లను సంప్రదింవచ్చు.