కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం.. మృతదేహాలు వెలికితీత!

 కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముత్తం 19 మంది సజీవ దహనం అయ్యారు.

Published on: Oct 24, 2025, 13:03:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరి సిబ్బంది, 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ మృతదేహాలను ఫోరెన్సిక్ బృందాలు వెలికితీశాయి. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక డ్రైవర్ పోలీసులు అదుపులో ఉన్నాడు. ప్రయాణికుల్లో ఎక్కువగా తెలంగాణ వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.

కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూలు బస్సు ప్రమాదం

ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. పెద్ద శబ్ధం వినిపించింది. చూస్తూ ఉండగానే మంటలు వ్యాపించాయి. కొందరు ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు దూకేశారు. బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కిందకు బైక్ దూసుకెళ్లి.. ఆ సమయంలో పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి.

బస్సుపై చలాన్లు

ఈ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. ముత్తం రూ.23120 పెండింగ్ చనాన్లు ఉన్నాయి. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించింది. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైనా చలాన్లు పడినాయి. మరోవైపు ఏపీ రవాణా శాఖ కూడా బస్సు ఫిట్‌నెస్ మీద మాట్లాడింది. కావేరి ట్రావెల్స్ పేరిట బస్సు రిజిస్ట్రేషన్ చేసి నడుపుతున్నారని, డామన్ డయ్యూలో 2018లో రిజిస్ట్రేషన్ చేశారని వెల్లడించింది.

ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉన్నది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం కారణంగానే మంటలు వచ్చాయని రవాణ శాఖ తెలిపింది. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించింది.

విచారణకు ఆదేశం

ఈ ఘటనతో బస్సు ప్రమాద ఘటనలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని చెప్పారు.

ప్రైవేట్ బస్సుల ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ప్రమాదానకి నిర్లక్ష్యం కారణం అని తెలిస్తే.. బాధ్యులపై చర్యలు తప్పవవి హెచ్చరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More