...
...
Next Story

తిరుమలలో భక్తుల రద్దీ - కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్, సర్వదర్శనానికి ఎంత సమయమంటే..?

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

Published on: Jun 29, 2026, 08:04:57 IST
Advertisement

తిరుమల గిరులు భక్తజనసందోహంతో పోటెత్తాయి. వీకెండ్ సెలవు దినాల ప్రభావంతో ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీనితో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు దాటి వెలుపల ఉన్న క్యూలైన్లలో సైతం భక్తులు కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా వేచి ఉన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

ప్రస్తుత రద్దీ పరిస్థితుల నేపథ్యంలో…. ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (ధర్మదర్శనం) లభించడానికి దాదాపు 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

నిన్నటి వివరాలు, హుండీ ఆదాయం

తిరుమలలో శ్రీవారి కొలువుకు సంబంధించి నిన్న (ఆదివారం) నమోదైన గణాంకాలను టీటీడీ విడుదల చేసింది.

  • శ్రీవారి దర్శనం : నిన్న(జూన్ 28) ఒక్కరోజే మొత్తం 91,793 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
  • స్వామివారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించి, తలముండనం చేయించుకున్న భక్తుల సంఖ్య 31,221 గా నమోదైంది.
  • తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.4.9 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలు రద్దు..!

శ్రీవారి దర్శనానికి సమయం ఎక్కువగా పడుతుండటంతో, వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చే భక్తులు క్యూలైన్ల పరిస్థితులను గమనించి, తగిన ఏర్పాట్లతో తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ నిర్ణయం కారణంగా ఆదివారం రోజు ఎలాంటి వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను స్వీకరించలేదు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే నిబంధనల మేరకు దర్శన వసతి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఇక ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో ఏరోజుకారోజు భక్తులకు జారీ చేసే 800 శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను సైతం సోమవారం(జూన్ 29) పూర్తిగా రద్దు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks