Solapur Anakapalle Weekly Express : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ ప్రయాణించే వారికి మరింత సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తూ కొత్త వారపు ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సోలాపూర్ - అనకాపల్లి - సొలాపూర్ (రైలు నంబర్లు 11313/11314) పేరుతో ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తోంది.

ఇప్పటివరకు ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ప్రత్యేక రైలు (రైలు నంబరు 01477/01478) రూపంలో నడుస్తున్న ఈ సర్వీసులను రైల్వే శాఖ ఇప్పుడు క్రమబద్ధీకరించింది (రైలు నంబర్లు 11313/11314). రెగ్యులర్ సర్వీసులుగా మార్పు చేసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది.
టైమింగ్స్ షెడ్యూల్….
- సోలాపూర్ - అనకాపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ - 11313) : ఈ రైలు ప్రతి శుక్రవారం ఉదయం 09:20 గంటలకు సోలాపూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ రెగ్యులర్ సర్వీస్ ప్రయాణం 2026, ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుంది. మార్గమధ్యలో వివిధ కీలక స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు (శనివారం) మధ్యాహ్నం 14:40 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది.
- అనకాపల్లి - సోలాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 11314) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి శనివారం రాత్రి 23:50 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. ఈ సర్వీస్ 2026, ఆగస్టు 22 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆదివారం రాత్రి 23:50 గంటలకు ఈ రైలు సోలాపూర్ చేరుకుంటుంది.
హాల్టింగ్ వివరాలు…
ఈ రైలు రెండు వైపులా ప్రయాణించే క్రమంలో అకల్కోట్ రోడ్, దుధ్ని, గాణాగాపూర్ రోడ్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదపల్లె రోడ్, పీలేరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం. యలమంచిలి స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
{{/usCountry}}ఈ రైలు రెండు వైపులా ప్రయాణించే క్రమంలో అకల్కోట్ రోడ్, దుధ్ని, గాణాగాపూర్ రోడ్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదపల్లె రోడ్, పీలేరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం. యలమంచిలి స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
{{/usCountry}}ఈ కొత్త రైలు సర్వీసుతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని సొలాపూర్, కర్ణాటకలోని ఆధ్యాత్మిక, పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా రవాణా సౌకర్యం లభించనుంది.