...
...
Next Story

విజయవాడ వేదికగా 'జాతీయ సరస్ మేళా' - ఏకంగా 576 స్టాళ్లు, విశేషాలివే

విజయవాడ పున్నమి ఘాట్‌లో అక్టోబర్ 13 నుంచి 31 వరకు 'జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026' నిర్వహించనున్నారు. 576 స్టాళ్లతో దేశవ్యాప్త గ్రామీణ ఉత్పత్తులు, 'స్వయం ఏపీ' బ్రాండ్ ఆవిష్కరణకు వేదిక కానుంది.

Published on: Oct 12, 2026, 09:05:13 IST
Advertisement

విజయవాడ నగరంలో 'జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026' నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ఈ మేళా గొప్ప వేదికగా నిలవనుంది.నగరంలోని ప్రసిద్ధ పున్నమి ఘాట్‌లో అక్టోబర్ 13 నుంచి 31 వరకు ఈ జాతీయ స్థాయి ప్రదర్శనను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

576 ప్రత్యేక స్టాళ్లు - దేశవ్యాప్త కళారూపాలు

జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026
జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026

ఈ ప్రదర్శనలో స్థానిక, దేశీయ మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 576 స్టాళ్లను సిద్ధం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే అత్యధికంగా 208 స్టాళ్లను కేటాయించారు. అలాగే ఇతర రాష్ట్రాలైన రాజస్థాన్ (24), మధ్యప్రదేశ్ (23), ఉత్తరప్రదేశ్ (22), మహారాష్ట్ర (21), పశ్చిమ బెంగాల్ (19), కేరళ (17), పంజాబ్ (17) తదితర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు తమ సంప్రదాయ ఉత్పత్తులను ఈ స్టాళ్లలో కొలువుదీర్చనున్నారు.

రాష్ట్రంలోని ఎస్‌హెచ్‌జీ మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు తయారు చేసిన వస్తువులను 'స్వయం ఏపీ' బ్రాండ్ కింద జాతీయ స్థాయిలో ప్రదర్శించి, విక్రయించేందుకు ఇది సువర్ణావకాశమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో సెర్ప్ (SERP), మెప్మా (MEPMA) సంస్థలు అంకితభావంతో పనిచేస్తున్నాయని కొనియాడారు.

నవరాత్రి శోభతో పాటు సాంస్కృతిక మేళవింపు

ఇంద్రకీలాద్రిపై ప్రసిద్ధ బెజవాడ కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌తో పాటు ఈ జాతీయ సరస్ ఆజీవిక మేళా కూడా ఒకే సమయంలో జరగడం భక్తులకు, సందర్శకులకు అపూర్వ అవకాశం దక్కనుంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మేళాను సందర్శించి దేశవ్యాప్త రుచులు, వైవిధ్యమైన ఉత్పత్తులను ఆస్వాదించవచ్చని మంత్రి కొండపల్లి పిలుపునిచ్చారు.

సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విశాలమైన పార్కింగ్, సురక్షిత తాగునీరు, పోలీసు భద్రత, వైద్య శిబిరాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు ఈ ప్రదర్శనను సందర్శించి గ్రామీణ మహిళల ప్రతిభను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks