విశాఖ నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ ఖాళీలు.. టెన్త్, ఐటీఐ ఉంటే చాలు!
నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్, విశాఖపట్నం అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్, విశాఖపట్నం(భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ కింద) 2025-26 బ్యాచ్ కోసం ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు నిర్ణీత తేదీలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. 320 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.

ఖాళీలు
320 పోస్టులు ట్రేడ్ వారీగా ఖాళీలు: ట్రేడ్‌లలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, ఆర్&ఏసీ మెకానిక్, మెకానిక్ డీజిల్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, క్యంప్యూటర్ ఆపరేటింగ్‌తోపాటుగా పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్‌లో శిక్షణ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు అప్రెంటిస్ చట్టం 1961, నావల్ డాక్‌యార్డ్ నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందుతారు. శిక్షణ కాలంలో భారత ప్రభుత్వ అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం నెలవారీగా స్టైపెండ్ చెల్లిస్తారు. అర్హతలు
అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి (మెట్రిక్) ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత, కనీసం 50% మార్కులతో అప్రెంటిస్‌షిప్ ప్రమాణాల ప్రకారం మెడికల్ ఫిట్‌నెస్ ఉండాలి. రాత పరీక్ష, మెరిట్ జాబితా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి.
దరఖాస్తు 1 డిసెంబర్ 2025న ప్రారంభమయ్యాయి. చివరి తేదీ: 02 జనవరి 2026 (రాత్రి 11:50 PM) వరకు ఉంటుంది. రాత పరీక్ష 22 మార్చి 2026, మెరిట్ జాబితా 25 మార్చి 2026, డాక్యుమెంట్ వెరిఫికేషన్ 30 మార్చి 2026, వైద్య పరీక్ష అండ్ రిపోర్టింగ్ 31 మార్చి 2026న ఉంటుంది.
ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. 14 నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాల వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. పూర్తి వివరాల కోసం www.joinindiannavy.gov.in ను సంప్రదించండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


