...
...
Next Story

Amrit Bharat Express : ఏపీ, తెలంగాణ మీదుగా మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ - ఈనెల 11 నుంచి ప్రారంభం...!

Nagercoil Cherlapalli Amrit Bharat Express :చర్లపల్లి-నాగర్‌కోయిల్ అమృత్‌ భారత్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈ కొత్త సేవలు మార్చి 11 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.

Published on: Mar 09, 2026 08:09 AM IST
Advertisement

హైదరాబాద్‌ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కనుంది. ఇటీవలనే రైల్వేశాఖ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటికే రెండు అమృత్ భారత్ సర్వీసులు నడుస్తుండగా… ఈ కొత్త సర్వీస్ తో కలిపి వీటి సంఖ్య మూడుకు చేరనుంది.

ఈనెల 11 నుంచి ప్రారంభం…!

అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్

ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నుంచి ముజఫర్‌పూర్‌, మరో ట్రైన్ తిరువనంతపురం మధ్య నడుస్తున్నాయి. తాజాగానే నాగర్‌కోయిల్ - చర్లపల్లి(హైదరాబాద్) మధ్య మరో ట్రైన్ ను రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఈ కొత్త సర్వీసుకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈనెల 11వ తేదీ నుంచి ఈ ట్రైన్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపారు.

  • దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం కోసం భారతీయ రైల్వే…. కొత్తగా నాగర్ కోయిల్-చర్లపల్లి-నాగర్ కోయిల్ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ప్రకటించింది.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందించనున్నది.
  • చర్లపల్లి(హైదరాబాద్) నుంచి బయలుదేరే ఈ ట్రైన్…. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఎర్నాకులం, కొట్టాయం, కొల్లాం మీదుగా నాగర్ కోయిల్(తమిళనాడు) కు చేరుకుంటుంది.
  • సుమారు 1500 కిలోమీటర్ల పైగా దూరం ప్రయాణించే ఈ రైలు సుమారు 30 నుంచి 31 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది.
  • సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, జనరల్ బోగీలు, ఛార్జింగ్ పాయింట్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
  • సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ టికెట్ ధరతో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం… ఈ ట్రైన్ ద్వారా పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe