దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో ప్రయాణించే పలు కీలక రైళ్ల సర్వీసుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్వహణ కారణాల వల్ల పుదుచ్చేరి మార్గంలో నడిచే ఐదు రైళ్లను పాక్షికంగా రద్దు లేదా ముందస్తుగా నిలిపివేస్తున్నట్లు (షార్ట్ టెర్మినేషన్) రైల్వే అధికారులు ప్రకటించారు. జూలై నెలలో వివిధ తేదీల్లో ఈ మార్పులు అమలులో ఉంటాయి.

దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం….. కాకినాడ, తిరుపతి, న్యూఢిల్లీ నుంచి పుదుచ్చేరి వెళ్లే రైళ్లతో పాటు హౌరా ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. ఆయా రైళ్ల పూర్తి వివరాలు, తేదీలు ఇలా ఉన్నాయి.
మార్పులు చేసిన రైళ్ల వివరాలు:
- కాకినాడ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 17655) : జూలై 11, జూలై 13 తేదీల్లో ప్రయాణించాల్సిన ఈ రైలును చెంగల్పట్టు వద్దే నిలిపివేస్తారు. చెంగల్పట్టు - పుదుచ్చేరి మధ్య ఈ రైలు సర్వీసును పాక్షికంగా రద్దు చేశారు.
- తిరుపతి - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 16111) : జూలై 12 నుంచి 15 వరకు, అలాగే జూలై 17, 18 తేదీల్లో నడిచే ఈ రైలు ముండియంపాక్కం వరకు మాత్రమే నడుస్తుంది. ముండియంపాక్కం - పుదుచ్చేరి మధ్య సర్వీస్ అందుబాటులో ఉండదు.
- తిరుపతి - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 16111) : జూలై 4, 8, 25, 29 తేదీల్లో ఈ రైలును విల్లుపురం వద్దే ముందస్తుగా నిలిపివేస్తారు. విల్లుపురం - పుదుచ్చేరి మధ్య ఈ రైలును పాక్షికంగా రద్దు చేశారు.
- పుదుచ్చేరి - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 12868) : జూలై 15న నడవాల్సిన ఈ రైలు పుదుచ్చేరికి బదులుగా విల్లుపురం స్టేషన్ నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. పుదుచ్చేరి - విల్లుపురం మధ్య ఈ సర్వీసును రద్దు చేశారు.
- న్యూఢిల్లీ - పుదుచ్చేరి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 22404) : జూలై 12న ప్రయాణించాల్సిన ఈ వీక్లీ రైలు పుదుచ్చేరి వరకు వెళ్లకుండా విల్లుపురం వద్దే ఆగిపోతుంది. విల్లుపురం - పుదుచ్చేరి మధ్య ఈ రైలు సర్వీసును పాక్షికంగా నిలిపివేశారు.
ఈ తేదీల్లో ప్రయాణం పెట్టుకునే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, స్టేషన్‌కు బయలుదేరే ముందే రైళ్ల తాజా రన్నింగ్ స్టేటస్‌ను ఒకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. మార్పులను గమనించి… ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
{{/usCountry}}ఈ తేదీల్లో ప్రయాణం పెట్టుకునే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, స్టేషన్‌కు బయలుదేరే ముందే రైళ్ల తాజా రన్నింగ్ స్టేటస్‌ను ఒకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. మార్పులను గమనించి… ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
{{/usCountry}}