...
...
Next Story

Andhra Pradesh : ఆగస్టు 1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం - ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం

Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు.

Published on: Jul 19, 2026 08:52 AM IST
Advertisement

Bhogapuram International Airport : ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయబోతున్న 'భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం దీనిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు
భోగాపురం ఎయిర్‌పోర్టు

2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌ను…. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా పూర్తి చేసింది. విమానాశ్రయ నిర్వహణకు అవసరమైన 8 కీలక చట్టబద్ధమైన అనుమతులు ఇప్పటికే లభించినట్లు నిర్మాణ సంస్థ జీఎంఆర్ (GMR) ప్రతిప్రతినిధులు, పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకను ఉత్తరాంధ్ర ప్రజలు గర్వపడేలా, ఒక పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్ - సీఎం చంద్రబాబు

సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. "హైదరాబాద్‌ రూపురేఖలను శంషాబాద్ విమానాశ్రయం ఎలా మార్చేసిందో, అదే తరహాలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కేవలం రవాణా సౌకర్యమే కాకుండా పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధి మరియు విశాఖ ఎకనామిక్ రీజియన్ వృద్ధికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది" అని పేర్కొన్నారు.

విమానాశ్రయం లోపలి భాగాలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రారంభోత్సవ వేడుకల్లో స్థానిక గిరిజన సాంప్రదాయాలు, హస్తకళల ప్రదర్శనలు ఉండేలా చూడాలని, విద్యార్థులు, యువతతో సహా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe