...
...
Next Story

IRCTC : ఈ తేదీ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్.. ఐఆర్‌సీటీసీ 4 తీర్థయాత్ర ప్యాకేజీలు

తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 21 నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లను నడపనుంది.

Published on: Feb 27, 2026, 05:46:27 IST
Advertisement

Tirupati : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) మార్చి 21-జూన్ 3 మధ్య 'భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్' పథకం కింద తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం నాలుగు ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకేజీలను నిర్వహిస్తుందని ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్ ఎన్.అశోక్ కుమార్ తెలిపారు.

ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు

ఈ రైళ్లు హైదరాబాద్/సికింద్రాబాద్ నుండి బయలుదేరి దక్షిణ, పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తాయని అశోక్ కుమార్ అన్నారు. ప్యాకేజీలలో రైలు ప్రయాణం, రోడ్డు రవాణా, హోటల్ వసతి, భోజనాలు, గైడెడ్ సైట్ సీయింగ్, అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణ ఇన్సూరెన్స్ అందిస్తారు. రైల్వే స్టేషన్లు, దేవాలయాల మధ్య ప్రయాణాన్ని కూడా ప్యాకేజీలో భాగంగానే అందిస్తారు.

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర

మార్చి 21–28, మే 24–31లో ఈ ప్యాకేజీ ఉంది. తిరువణ్ణామలై(అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, ఇతర గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. ఒక్కో వ్యక్తికి రూ.14,700 (స్లీపర్), రూ. 22,300 (3ఏసీ), రూ.28,700 (2ఏసీ) ఛార్జీలు, సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, నెల్లూరు, రేవులలో బోర్డింగ్ అందుబాటులో ఉంటుంది.

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర

ఏప్రిల్ 14-24 ఉన్న ఈ ప్యాకేజీ ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, పూణే (భీమశంకర్), నాసిక్, ఔరంగాబాద్‌లను కవర్ చేస్తుంది. ఛార్జీలు రూ.17,600 (స్లీపర్), రూ. 26,700 (3ఏసీ), రూ. 34,600 (2ఏసీ), సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్ మరియు పూర్ణలో బోర్డింగ్ అందుబాటులో ఉంటుంది.

అయోధ్య–కాశీ–బైద్యనాథ్ ధామ్ దర్శన యాత్ర

మే 12–21 తేదీలో ఉన్న ఈ ప్యాకేజీ మధుర, బృందావన్, మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్‌లను కవర్ చేస్తుంది. ఒక్కో వ్యక్తికి రూ. 16,500 (స్లీపర్), రూ. 25,700 (3ఏసీ), రూ. 33,400 (2ఏసీ)గా ధర ఉంటుంది.

ప్రతి రైలులో దాదాపు 705 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మంది ప్రయాణికులకు ఇద్దరు కోఆర్డినేటర్లు, ప్రతి కోచ్‌లో ఒక సెక్యూరిటీ గార్డు ఉంటారని అశోక్ కుమార్ తెలిపారు. బుకింగ్‌లు, విచారణ కోసం 9281495853, 8287932313 నంబర్లలో లేదా ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks