...
...
Next Story

Tirumala Electric Buses : తిరుమలలో అందుబాటులోకి 25 ఎలక్ట్రిక్ బస్సులు

Tirumala Electric Buses : టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను రిలయన్స్ ఫౌండేషన్ అందజేసిన విషయం తెలిసిందే. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న సందర్భంగా ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

Published on: Sep 16, 2026, 14:06:37 IST
Advertisement

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సామాజిక సేవా విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్, తిరుమలకు వచ్చే భక్తులకు కాలుష్య రహిత, మరింత స్థిరమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా 25 ఎలక్ట్రిక్ బస్సులు, ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని అందజేసింది. తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులు

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యక్షేత్రానికి రానున్న తరుణంలో ఈ బస్సులు అందుబాటులోకి రావడం విశేషం. జూన్ 2026లో తిరుమల పర్యటన సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఇచ్చిన హామీ నెరవేర్చారు. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే దిశగా టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను అందజేస్తామని ఆయన ఆ సమయంలో హామీ ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ కేంద్రాలు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు రిలయన్స్ ఫౌండేషన్, టీటీడీ కలిసి పనిచేశాయి.

ఈ 25 ఎలక్ట్రిక్ బస్సుల చేరిక టీటీడీ చేపట్టిన పర్యావరణహిత రవాణా (గ్రీన్ మొబిలిటీ) విధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది సంప్రదాయ ఇంధన వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు ఏటా తిరుమలను సందర్శించే లక్షలాది మంది భక్తులకు పర్యావరణహితమైన రవాణా సదుపాయాన్ని అందిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ కార్యక్రమం రిలయన్స్ ఫౌండేషన్, జియో-బిపి ఉమ్మడి కృషితో సాధ్యమైంది. రిలయన్స్ ఫౌండేషన్ దాతృత్వ సహాయాన్ని అందించగా, జియో-బిపి ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనలో తన నైపుణ్యాన్ని అందించింది.

భారతదేశ వ్యాప్తంగా సుస్థిర అభివృద్ధిని సాధించడంతో పాటు స్వచ్ఛమైన రవాణా పరిష్కారాలను ప్రోత్సహించాలనే రిలయన్స్ విస్తృత లక్ష్యంలో ఈ కార్యక్రమం ఒక భాగం అని ఆ సంస్థ పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks