రద్దీ దృష్ట్యా నేడు, రేపు, ఎల్లుండి(డిసెంబర్ 18, 19, 20వ తేదీల్లో) మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి, మంచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడుస్తాయి.

రైలు నెంబర్ 07297 మచిలీపట్నం-ఉమ్డానగర్ ఈరోజు(డిసెంబర్ 18) రాత్రి 9:15 మచిలీపట్నం నుంచి బయలుదేరుతుంది. గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ స్టేషన్లలో ఆగుతుంది. శుక్రవారం ఉదయం 9:45కు ఉమ్డానగర్ చేరుకుంటుంది.
మరో ప్రత్యేక రైలు 07296 నెంబర్.. శుక్రవారం(డిసెంబర్ 19) రాత్రి 7.40గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరిలో స్టాప్ ఉంది. శనివారం ఉదయం 9:30కి కాచిగూడ వస్తుంది.
తిరుపతి నుంచి ప్రయాగ్‌రాజ్‌కి కూడా వన్ వే స్పెషల్ రైలును దక్షిణ మధ్య రైల్వే అనౌన్స్ చేసింది. రైలు నెంబర్ 07298 తిరుపతి-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ ట్రైన్.. డిసెంబర్ 20 తేదీన తిరుపతి నుంచి ఉదయం 8:15కి బయలుదేరుతుంది. రెండు రోజుల తర్వాత ఉదయం 4:30కి ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ రేణిగుండ, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గూటి, గుంతకల్, మంత్రాలయం రోడ్, రాయిచూర్, కృష్ణ, యాదగిర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, చంద్రపూర్, నాగపూర్, బెటుల్, ఇటార్సి, బోపాల్, బినా, ఝాన్సీ, ఓరాయ్, గోవిందపూరి స్టేషన్లలో ఆగుతుంది.
సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ సందర్భంగా వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 16 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. వేర్వురు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
{{/usCountry}}సంక్రాంతి పండుగ సందర్భంగా వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 16 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. వేర్వురు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
{{/usCountry}}సికింద్రాబాద్ - శ్రీకాకుళం(ట్రైన్ నెంబర్ 07288) మధ్య జనవరి 9 , 11 తేదీల మధ్ స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్ రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరునాడు మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు.
ఇక శ్రీకాకుళం - సికింద్రాబాద్ మధ్య జనవరి 10, 12 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం నుంచి బయల్దేరి.. మరునాడు ఉదయం 8.10 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్స్ చర్లపల్లి, కాజీపేట, ఖమ్మం, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలసం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.
ఇక సికింద్రాబాద్ - శ్రీకాకుళం (ట్రైన్ 07290) జనవరి 10,12,16,18 తేదీల్లో ట్రైన్స్ ఉంటాయి. అంతేకాకుండా జనవరి 11, 13, 17, 19 తేదీల్లో శ్రీకాకుళం - సికింద్రాబాద్(07291) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
వికారాబాద్ - శ్రీకాకుళం మధ్య జనవరి 13వ తేదీన ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇక జనవరి 14వ తేదీన శ్రీకాకుళం - సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్స్ లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కాజేపీట, వరంగల్, ఖమ్మం, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాప్లి, దువ్వాడ, కొత్తవలసం, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
జనవరి 17వ తేదీన సికింద్రాబాద్ - శ్రీకాకుళం, జనవరి 18వ తేదీన శ్రీకాకుళం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.