Simhachalam : సింహాచలం చందనోత్సవం టికెట్లు ఓన్లీ ఆన్‌లైన్‌లోనే.. ఇలా తీసుకోవచ్చు

Simhachalam Chandanotsavam : విశాఖ సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం టికెట్లు ఏప్రిల్ 17 నుండి ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.

Published on: Apr 17, 2026, 17:48:06 IST
By , Simhachalam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖ సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ సందర్భంగా దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 17, 2026 నుండి బ్యాంకుల ద్వారా టికెట్ల విక్రయాలను నిలిపివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ (https://chandanotsavam.ap.gov.in), ప్రభుత్వ 'మన మిత్ర' వాట్సాప్ సేవ ద్వారా మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటి బుకింగ్‌లు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి.

సింహాచలం చందనోత్సవం టికెట్లు
సింహాచలం చందనోత్సవం టికెట్లు

మనమిత్ర వాట్సాప్ ద్వారా రూ.1,000 విలువైన 460 టికెట్లు, రూ.300 విలువైన 750 టికెట్లు విడుదల చేస్తారు. అదే సమయంలో, ఆన్‌లైన్‌లో 2,215 టికెట్లు రూ.1,000, 3,370 టికెట్లు రూ.300) అందుబాటులో ఉంటాయి. చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని నివారించేందుకు, కేటాయించిన కోటా పరిధిలో భక్తులు ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 8 గంటల నుంచి టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. భక్తులు టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ https://chandanotsavam.ap.gov.in ద్వారా, వాట్సాప్ నెంబర్ 9552300009 మన మిత్ర ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 20వ తేదీన సింహాచలం అప్పన్నస్వామివారికి చందనోత్సవం జరగనుంది. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా.. భక్తులు అందుబాటులో ఉన్న టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలి.

మరోవైపు విశాఖ సింహాచలం అప్పన్నస్వామివారికి సమర్పించే చందనం కోసం అరగదీత కార్యక్రమం ఇప్పటికే నిర్వహించారు. స్వామికి సమర్పించే చందన చెక్కలను ముక్కలుగా కట్ చేసి అరగదీశారు. మెుదట పూసపాటి వంశస్థులు అప్పన్న స్వామిని దర్శించుకుంటారు.

ఈ నెల 20వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. దర్శనాల కోసం 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఏఐ పరిజ్ఞానంతో చందనోత్సవంలో పాల్గొనే భక్తుల సంఖ్య లెక్కిస్తారు.

టికెట్ల డబ్బులు రిటర్న్

మరోవైపు ఏప్రిల్ 13 నుంచి 17వ తేదీ వరకు అప్పన్నస్వామివారి నిజరూప దర్శనం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం టికెట్లు విక్రయించారు. ఇందులో కాస్త గందరగోళం నెలకొన్నది. ఆన్‌లైన్‌లో నిజరూప దర్శనం టికెట్లు బుక్ చేసుకొని నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తి అయినా.. టికెట్లు రాని భక్తులకు భక్తుల ఖాతాల్లో మెుత్తం నగదు జమ చేస్తామని సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు చెప్పారు.

అలా సోమ్ము చెల్లించినా.. టికెట్లు రానివారి లిస్ట్ సిద్ధం చేయాలని సిబ్బందిని ఈవో ఆదేశించారు. చందనోత్సవం తర్వాత.. టికెట్లు పొందనివారి ఖాతాలకు సొమ్ము పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు ఆందోళన చెందకూడదని భరోసా ఇచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More