...
...
Next Story

ప్రయాణికులకు శుభవార్త... తిరుపతి - చర్లపల్లి మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్..! టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల లిస్ట్ ఇదే

SCR Tirupati Charlapalli Weekly Express : తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన తిరుపతి - చర్లపల్లి వీక్లీ స్పెషల్ రైలును క్రమబద్ధీకరించింది. మే 28, 2026 నుంచి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ గా సర్వీసులను ప్రారంభించనుంది.

Published on: May 23, 2026, 14:09:57 IST
Advertisement

SCR Tirupati Charlapalli Weekly Express : తిరుపతి, హైదరాబాద్‌లోని చర్లపల్లి మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన తిరుపతి - చర్లపల్లి - తిరుపతి వీక్లీ స్పెషల్ రైలును రెగ్యూలరైజ్ చేసింది. మే 28, 2026 నుంచి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ గా సర్వీసులను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

  • తిరుపతి - చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ : తిరుపతి నుంచి చర్లపల్లి వెళ్లే ఈ రైలు (ట్రెయిన్ నెం. 17443) వారానికి ఒకరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రెగ్యులర్ సర్వీస్ 2026 మే 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి వారం గురువారం సాయంత్రం 16:30 గంటలకు తిరుపతిలో బయలుదేరి….. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 08:25 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
  • చర్లపల్లి - తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ : తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుంచి తిరుపతి వెళ్లే రైలు (ట్రెయిన్ నెం. 17444) 2026 మే 29వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 16:20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి…. శనివారం ఉదయం 07:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

2-0-119897561-Indian-Railway-4C-0_1681890721669
2-0-119897561-Indian-Railway-4C-0_1681890721669

ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల,ప్రొద్దుటూరు, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, మార్కాపూర్ రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లు ఉన్నాయి.

ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో అన్ని వర్గాల ప్రయాణికులకు అనుగుణంగా కోచ్‌లను ఏర్పాటు చేశారు.

  • సెకండ్ ఏసీ (2A) - 1 కోచ్
  • థర్డ్ ఏసీ (3A) - 3 కోచ్‌లు
  • స్లీపర్ క్లాస్ (Sleeper) - 14 కోచ్‌లు
  • జనరల్ సెకండ్ క్లాస్ (General) - 4 కోచ్‌లు

వేసవి రద్దీ, సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ఎంతో ఊరటనివ్వనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks