SCR Summer Special Trains : వేసవి సెలవుల్లో విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలైన తిరుచానూరు, తిరుపతికి వెళ్లే భక్తుల కోసం, అలాగే హైదరాబాద్, బెళగావి, నాందేడ్ వంటి ప్రముఖ నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం ఈ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. మే మొదటి, రెండో వారాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.
పొడిగించిన రైళ్ల వివరాలు:
తిరుచానూరు - నాందేడ్ - జాల్నా రూట్: మహారాష్ట్ర నుంచి తిరుచానూరు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. రైలు సంఖ్య 07015 (హెచ్.ఎస్. నాందేడ్ - తిరుచానూరు) మే 2న (శనివారం) నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు సంఖ్య 07016 (తిరుచానూరు - హెచ్.ఎస్. నాందేడ్) మే 3న (ఆదివారం) అందుబాటులో ఉంటుంది.
- జాల్నా - తిరుచానూరు (07609) మధ్య మే 4వ తేదీతో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో (07610) మే 5వ తేదీన మరో ట్రైన్ నడుస్తుంది.
- తిరుపతి - పండరీపూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైలు సంఖ్య 07012 (తిరుపతి - పండరీపూర్) మే 9న (శనివారం) ఒక ట్రిప్పు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు సంఖ్య 07032 (పండరీపూర్ - తిరుపతి) మే 10న (ఆదివారం) అందుబాటులో ఉంటుంది.
- హైదరాబాద్ - బెళగావి మధ్య ప్రత్యేక రైళ్లుంటాయి. రైలు సంఖ్య 07043 (హైదరాబాద్ డెక్కన్ - బెళగావి) మే 7న (గురువారం) బయలుదేరుతుంది. రైలు సంఖ్య 07044 (బెళగావి - హైదరాబాద్ డెక్కన్) మే 8న (శుక్రవారం) తిరుగు ప్రయాణం అవుతుంది.
- నాందేడ్ - ధర్మవరం మధ్య నడిచే 07189/07190 రైళ్లను కూడా మే 8, మే 10 తేదీల్లో ఒక ట్రిప్పు పాటు పొడిగించారు.
వేసవి రద్దీ కావటంలో రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ విపరీతంగా పెరుగుతోంది. ఈ రద్దీని తగ్గించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సమయాలను ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా సరిచూసుకుని రిజర్వేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
{{/usCountry}}వేసవి రద్దీ కావటంలో రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ విపరీతంగా పెరుగుతోంది. ఈ రద్దీని తగ్గించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సమయాలను ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా సరిచూసుకుని రిజర్వేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
{{/usCountry}}