...
...
Next Story

ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు…!

సంక్రాంతి పండగ కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణ మీదుగా 16 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.జనవరి 9వ తేదీ నుంచి ఈ ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయి.

Published on: Dec 17, 2025, 11:56:27 IST
Advertisement

సంక్రాంత పండగ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లు ప్రకటించగా…. తాజాగా మరో 16 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. వేర్వురు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

ప్రత్యేక రైళ్లు…

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

సికింద్రాబాద్ - శ్రీకాకుళం(ట్రైన్ నెంబర్ 07288) మధ్య జనవరి 9 , 11 తేదీల మధ్ స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్ రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరునాడు మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు.

ఇక శ్రీకాకుళం - సికింద్రాబాద్ మధ్య జనవరి 10, 12 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం నుంచి బయల్దేరి.. మరునాడు ఉదయం 8.10 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్స్ చర్లపల్లి, కాజీపేట, ఖమ్మం, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలసం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.

ఇక సికింద్రాబాద్ - శ్రీకాకుళం (ట్రైన్ 07290) జనవరి 10,12,16,18 తేదీల్లో ట్రైన్స్ ఉంటాయి. అంతేకాకుండా జనవరి 11, 13, 17, 19 తేదీల్లో శ్రీకాకుళం - సికింద్రాబాద్(07291) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

వికారాబాద్ - శ్రీకాకుళం మధ్య జనవరి 13వ తేదీన ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇక జనవరి 14వ తేదీన శ్రీకాకుళం - సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్స్ లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కాజేపీట, వరంగల్, ఖమ్మం, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాప్లి, దువ్వాడ, కొత్తవలసం, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

జనవరి 17వ తేదీన సికింద్రాబాద్ - శ్రీకాకుళం, జనవరి 18వ తేదీన శ్రీకాకుళం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe