...
...
Next Story

SCR Special Trains : తెలుగు ప్రయాణికులకు గుడ్ న్యూస్... తిరుపతి - నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు! షెడ్యూల్ వివరాలు

SCR Tirupati Nagarsol Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఆగస్టు 23, 26 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

Published on: Jul 29, 2026, 14:26:55 IST
Advertisement

SCR Tirupati Nagarsol Special Trains : తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ మార్గాల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మరియు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తిరుపతి – నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్…

  • రైలు నంబర్ 07427 (తిరుపతి – నాగర్‌సోల్) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 23న (ఆదివారం) తెల్లవారుజామున 03:30 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు అంటే ఆగస్టు 24 (సోమవారం) ఉదయం 08:00 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 07428 (నాగర్‌సోల్ – తిరుపతి) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 26న (బుధవారం) మధ్యాహ్నం 14:30 (2:30) గంటలకు నాగర్‌సోల్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఆగస్టు 27 (గురువారం) సాయంత్రం 18:45 (6:45) గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

రైలు స్టేషన్లు…

తిరుపతి - నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి - నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే క్రమంలో రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్భణి, జాల్నా, ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్) స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ సెకండ్ టైర్ , ఏసీ థర్డ్ టైర్ , స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe