దసరా పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి - విజయపుర (కర్ణాటక) నగరాల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. రేణిగుంట, గుంతకల్లు, గదగ్ మీదుగా నడిచే ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 2026 నెలలో మొత్తం 4 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి – విజయపుర స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం. 07419)
స్పెషల్ ట్రైన్స్
{{^htLoading}} {{/htLoading}}
అక్టోబర్ 04, 2026 నుండి అక్టోబర్ 25, 2026 వరకు ప్రతి ఆదివారం (మొత్తం 4 ట్రిప్పులు) నడుస్తుంది. తిరుపతిలో ఉదయం 08.15 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10.25 గంటలకు విజయపుర చేరుకుంటుంది.
విజయపుర – తిరుపతి స్పెషల్ రైలు (ట్రెయిన్ నెం. 07420)
అక్టోబర్ 4, 2026 నుండి అక్టోబర్ 25, 2026 వరకు ప్రతి ఆదివారం (మొత్తం 4 ట్రిప్పులు) బయలుదేరుతుంది. విజయపురలో రాత్రి 11.35 గంటలకు బయలుదేరుతుంది. తర్వాతి రోజు సోమవారం మధ్యాహ్నం 02.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ఈ రైళ్లు వెళ్తాయి. రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, బళ్లారి, తోరణగల్లు, హొసపేట, కొప్పళ్, గదగ్, హొళె ఆలూర్, బాదామి, బాగల్‌కోట్, అల్మట్టి, బసవన బాగేవాడి రోడ్‌లో ట్రైన్స్ ఆగుతాయి.
ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. దసరా శరన్నవరాత్రుల సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు, అలాగే కర్ణాటకలోని బాగల్‌కోట్, బాదామి, విజయపుర వంటి చారిత్రక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ స్పెషల్ రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనందున ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా గానీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో గానీ ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.