...
...
Next Story

Tirupati-Vizag Special Train : తిరుపతి-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ సర్వీసులు పొడిగింపు

Tirupati-Vizag Special Train : తిరుపతి-విశాఖపట్నం నడుమ ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త అందించింంది. బై-వీక్లీ స్పెషల్ ట్రైన్స్ సర్వీసులను పొడిగించింది.

Published on: Nov 24, 2026, 06:59:36 IST
Advertisement

పండుగలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుడ్‌న్యూస్ అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-విశాఖపట్నం మధ్య నడిచే బై-వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలను పొడిగించింది. దీంతో తిరుమల దర్శనానికి వెళ్లేవారికి ఈ ట్రైన్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవారికి రవాణా సౌకర్యం ఈజీ కానుంది.

తిరుపతి-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్స్ (Unsplash)
తిరుపతి-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్స్ (Unsplash)

రైలు నంబర్ 08509 తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక రైలు నవంబర్ 29 నుండి జనవరి 28 వరకు ప్రతి ఆదివారం, గురువారం ఉదయం 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మొత్తం 18 ట్రిప్పులు నడుపుతారు.

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08510 విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు నవంబర్ 30 నుండి జనవరి 29 వరకు ప్రతి సోమవారం, శుక్రవారం సాయంత్రం 7.40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ ట్రైన్లు రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల తాడిపత్రి, గూటి గుంతకల్, డోన్, బేతంచర్ల, నంద్యాల, దిగువమెట్ట, మార్కాపూర్ రోడ్డు, దొనకొండ, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామలకోట స్టేషన్లలో ఆగుతాయి.

విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు

విశాఖపట్నం నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వెళ్లే భక్తుల కోసం రైలు నంబర్ 07424 ప్రత్యేక సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు నవంబర్ 24 రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు నవంబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ట్రైన్ ఆన్ డిమాండ్ (TOD) ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.

పండుగలు, పుణ్యక్షేత్రాల రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సౌత్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks