Visakhapatnam Bengaluru Special Trains : రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ రైల్వే (Southern Railway) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం - బెంగళూరు మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా చెరో 8 సర్వీసుల చొప్పున మొత్తం 16 సర్వీసులను అక్టోబర్, నవంబర్ నెలల్లో అందుబాటులోకి వస్తాయి.
రైళ్ల వివరాలు - టైమింగ్స్ :
- రైలు నంబరు 08583 (విశాఖపట్నం - SMVT బెంగళూరు) : ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 6, 13, 20, 27 మరియు నవంబర్ 3, 10, 17, 24 తేదీలలో (మంగళవారాలు) విశాఖపట్నంలో సాయంత్రం 19:00 గంటలకు (రాత్రి 7.00) బయలుదేరుతుంది. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 12:45 గంటలకు SMVT బెంగళూరు చేరుకుంటుంది.
- రైలు నంబరు 08584 (SMVT బెంగళూరు - విశాఖపట్నం) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబర్ 7, 14, 21, 28 మరియు నవంబర్ 4, 11, 18, 25 తేదీలలో (బుధవారాలు) SMVT బెంగళూరులో మధ్యాహ్నం 15:50 గంటలకు (3.50) బయలుదేరుతుంది. మరుసటి రోజు (గురువారం) మధ్యాహ్నం 13:30 గంటలకు (1.30) విశాఖపట్నం చేరుకుంటుంది.
హాల్టింగ్ లిస్ట్….

{{^htLoading}} {{/htLoading}}
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు మరియు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని కోరారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}