...
...
Next Story

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ - విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా తిరుగిరులు

Tirumala Srivari Salakatla Brahmotsavams : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. గరుడ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ ఏనుగుల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Published on: Sep 18, 2026, 09:36:54 IST
Advertisement

Tirumala Srivari Salakatla Brahmotsavams : తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల శోభ తిరుపతి నగరంలోనూ వెల్లివిరుస్తోంది. శ్రీవారి వాహనసేవలను వీక్షించేందుకు తరలివచ్చే భక్తులకు తిరుపతిలోనే భక్తి, ఆధ్యాత్మికత, ఉత్సవ వైభవంతో కూడిన ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేలా టీటీడీ విస్తృతంగా విద్యుద్దీపాలంకరణలు చేపట్టింది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026

తిరుపతి నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, టీటీడీ భవనాలు, పార్కింగ్ ప్రాంతాలు, హోల్డింగ్ పాయింట్లు తదితర ప్రాంతాలు రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా మారాయి. ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణలు రాత్రివేళ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్వాగత తోరణాలతోపాటు, శ్రీవారి దశావతారాలు, మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మీ సమేత మహావిష్ణువు, శ్రీ వేంకటేశ్వరస్వామివారు, విశ్వరూపం, హృదయలక్ష్మి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అష్టలక్ష్ముల విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా కృత్రిమ ఏనుగులు…

గరుడ సర్కిల్ వద్ద తొలిసారిగా ఏర్పాటు చేసిన కృత్రిమ ఏనుగుల విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గరుడ విగ్రహం సర్కిల్, అలిపిరి టోల్‌గేట్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.

బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సమాచారం భక్తులకు చేరేలా తిరుపతిలోని ప్రధాన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వాహనసేవలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తదితర సమాచారాన్ని భక్తులకు అందిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks