తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన, స్వామివారికి అత్యంత ఇష్టమైన వాహనమైన గరుడ వాహన సేవ శుక్రవారం (అక్టోబర్ 16) సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భద్రతను కోసం అక్టోబర్ 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి శనివారం (అక్టోబర్ 17) ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు రెండు ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాలను నిషేధిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి, ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోగలిగేలా టీటీడీకి సహకరించాలని బీఆర్ నాయుడు కోరారు. ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాల రద్దీ కారణంగా పార్కింగ్ సమస్యలు తీవ్రంగా ఏర్పడ్డాయి. గరుడ సేవకు హాజరయ్యే భక్తులు తమ వాహనాలను తిరుపతిలోని నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలలో నిలిపి, ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో తిరుమలకు ప్రయాణించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. భక్తులు తమ భద్రత, సురక్షిత ప్రయాణం కోసం పోలీసులు, రవాణా శాఖ సూచనలను పాటించాలని కూడా కోరారు.
కల్పవృక్ష వాహనంపై స్వామివారు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
గజరాజుల ముందు నడక, మంగళవాయిద్యాల నాదం, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణం నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారి కృపాకటాక్షాలు పొందారు.
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరిన ఫలాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పురాణాలు పేర్కొంటాయి. అటువంటి కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం భక్తులకు ఐహిక శుభాలు, సకలాభీష్టాల ప్రాప్తికి ప్రతీకగా నిలుస్తుంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈఓ (విద్యా, ఆరోగ్యం గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
{{/usCountry}}ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈఓ (విద్యా, ఆరోగ్యం గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
{{/usCountry}}