తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించిన కానుకల వేలానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలను ఈ-వేలం (E-Auction) ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈనెల 21న ఈ-వేలం…

ఈ వేలం ప్రక్రియ సెప్టెంబరు 21వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబరు 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగుతుంది. ఈ సారి వేలంలో ప్రధానంగా కొత్తవి అయిన ఆర్ట్ సిల్క్ చీరలను ఉంచారు. మొత్తం 132 లాట్లుగా వీటిని విభజించి ఆన్‌లైన్ వేలానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. వ్యాపారులు, భక్తులు, సాధారణ ప్రజలు ఈ-వేలంలో పాల్గొని తమకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు.
ఈ-వేలానికి సంబంధించిన మరింత సమాచారం, నిబంధనలు తెలుసుకోవాలనుకునే వారు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) ఫోన్ నంబరు 0877-2264429ను నేరుగా సంప్రదించవచ్చు. అలాగే వేలంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ www.konugolu.ap.govt.in లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org ని సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.
శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి వేడుకలు :
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 14న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయక స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపడతారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.
రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉదయం 8 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
{{/usCountry}}రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉదయం 8 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
{{/usCountry}}