...
...
Next Story

టూరిజం కోర్సు చదవాలనుకుంటున్నారా? టీటీడీ నుంచి అద్భుత అవకాశం.. ఇలా అప్లై చేయండి

టీటీడీ ఆధ్వర్యంలోని కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ మెుదలైంది. శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మెుదలైంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

Published on: Jun 4, 2026, 13:15:43 IST
Advertisement

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ సంస్కృతి, సాహిత్యం, భాషా వైభవాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశమని కళాశాల యాజమాన్యం తెలిపింది.

టీటీడీ కాలేజీల్లో అడ్మిషన్లు
టీటీడీ కాలేజీల్లో అడ్మిషన్లు

బి.ఏ.(ఓ.ఎల్.) డిగ్రీ కోర్సులో తెలుగు, సంస్కృతం, హిందీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ విభాగాలలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. అలాగే ప్రీ-డిగ్రీ (ఇంటర్‌మీడియట్‌కు సమానం) కోర్సులో సంస్కృతం, తెలుగు, హిందీ విభాగాలలో కూడా అడ్మిషన్లు జరుగనున్నాయి.

ఉచిత హాస్టల్‌, భోజన సదుపాయాలు

ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఉచిత హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. అంతేకాదు ఉచిత భోజన వసతి కూడా అందుబాటులో ఉంటుంది. రెండేళ్ల ప్రీ-డిగ్రీ కోర్సులకు 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు అర్హులు.

మూడేళ్ల డిగ్రీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ప్రీ-డిగ్రీ, ఇంటర్‌మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల సమర్పణ

జూన్ 17, 2026 నుండి సంబంధిత విద్యార్హతల ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. కె.టి. రోడ్డులోని ఎస్వీ ప్రాచ్య కళాశాల కార్యాలయంలో రూ.25 చెల్లించి దరఖాస్తు ఫారాలు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31, 2026లోపు సమర్పించాలి. మరిన్ని వివరాలకు 9848642346, 6281894208 నంబర్లలో సంప్రదించవచ్చని కళాశాల అధికారులు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఇప్పటికే టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks