తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం చరిత్రలోనే అరుదైన ఘట్టం నమోదైంది. శ్రీవారి హుండీ కానుకల రూపంలో ఏకంగా రూ. 6.93 కోట్ల ఆదాయం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలోనే ఒక్క రోజులో ఇంత భారీ మొత్తంలో కానుకలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఆరు కోట్లకుపైగా మూడుసార్లు వచ్చాయి.

బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా ఈ రికార్డు స్థాయి ఆదాయం తేలింది. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారిపై ఉన్న అపార భక్తితో భారీ మొత్తంలో హుండీ కానుకలు సమర్పించడమే చారిత్రాత్మక రికార్డుకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.
జులై 26, 2012న శ్రీవారి హుండీకి రూ. 5.73 కోట్ల ఆదాయం రాగా, ఆ తర్వాతి కాలంలో ఏప్రిల్ 2018 లో ఒకేరోజు రూ. 6.28 కోట్లు లభించి రికార్డు సృష్టించింది. మార్చి 2022లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 6.18 కోట్లుగా నమోదైంది. ఇప్పుడు లభించిన రూ. 6.93 కోట్లతో కలిపి టీటీడీ చరిత్రలో ఒక్క రోజులో రూ. 6 కోట్లకు పైగా హుండీ కానుకలు రావడం ఇది మూడోసారి.
సాధారణ రోజుల్లో శ్రీవారికి ప్రతిరోజూ సగటున రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుంటుంది. అయితే పండుగలు, ప్రత్యేక ఉత్సవాలు, అజ్ఞాత భక్తులు సమర్పించే భారీ విరాళాల సమయంలో ఈ ఆదాయం కొత్త రికార్డులను సృష్టిస్తోంది.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
వరుస సెలవుల వస్తుండటంతో కొండపైకి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13వ తేదీ ఆదివారం రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నాడు ఎటువంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}వరుస సెలవుల వస్తుండటంతో కొండపైకి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13వ తేదీ ఆదివారం రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నాడు ఎటువంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}ఆదివారం రోజు రద్దు చేసిన వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని పూర్తిగా సామాన్య భక్తులకే కేటాయిస్తారు. దీంతో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది సామాన్య భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం భాగ్యం కలుగుతుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి.. టీటీడీ యాజమాన్యానికి సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 12వ తేదీ శనివారం నుంచి 14వ తేదీ సోమవారం వరకు వరుసగా సెలవులు రానున్నాయి. దీనితో వీకెండ్ కలసి రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రానున్న రెండు, మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.