సాధారణంగానే తిరుమలలో రద్దీ ఉంటుంది. ఇక వేసవి సెలవులు మెుదలైన తర్వాత ఈ రద్దీ ఎక్కువ అవుతుంది. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు వేస్తోంది. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటుగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఫాలో చేసిన నిబంధనలు అమలు చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

కిందటి సంవత్సరాల డేటాను చూస్తే వేసవి సెలవుల్లో ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. మే, జూన్, జులై నెలల్లో ప్రతి నెల సగటున 23 నుంచి 24 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చారు. ఈ లెక్కలు పరిశీలించిన టీటీడీ వేసవి సెలవుల దృష్ట్యా.. వీఐపీ బ్రేక్, ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు వీఐపీ దర్శనాలకు రోజూ 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తున్నారు. ఆ సమయంలో 3800 వరకు వీఐపీలు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ మూడు గంటల సమయాన్ని సామాన్యులకు కేటాయిస్తే అనే అంశాన్ని పరిశీలించినప్పుడు కీలక విషయాన్ని గుర్తించారు. మూడు గంటల్లో సామాన్య భక్తులు ఏకంగా 15వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు.
ఈ లెక్కలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిశీలించింది. ఇందులో భాగంగా వేసవిలో వీఐపీ దర్శనాలను రద్దు చేయాలని అనుకుంటోంది. ఇక ఎస్ఎస్‌డీ విధానంలో దర్శనాలకు 22 నుంచి 23 గంటలు నిరీక్షించాలి. ఇలా దర్శనాల కేటగిరీలు అన్నింటినీ పక్కకు పెట్టి.. వైకుంఠ ఏకాదశి విధానం అమలు చేయాలని తిరుమల అధికారులు అనుకుంటున్నారు. ఇలా చేస్తే.. 8 నుంచి 12 గంటల వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రోజుకు సగటున 80 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించవచ్చు అని చెబుతున్నారు.
లగేజీ డిపాజిట్ కేంద్రం ఉద్యోగి తొలగింపు
నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై తిరుమలలోని లగేజీ డిపాజిట్ కేంద్రంలో పనిచేస్తున్న ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తిరుమల తిరుపతి దేవస్థానం తొలగించింది. నరసింహ రెడ్డి అనే వ్యక్తి, లగేజీ డిపాజిట్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నందుకు యాత్రికుల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన టీటీడీ, అతని సేవలను తక్షణమే రద్దు చేసింది.
{{/usCountry}}నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై తిరుమలలోని లగేజీ డిపాజిట్ కేంద్రంలో పనిచేస్తున్న ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తిరుమల తిరుపతి దేవస్థానం తొలగించింది. నరసింహ రెడ్డి అనే వ్యక్తి, లగేజీ డిపాజిట్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నందుకు యాత్రికుల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన టీటీడీ, అతని సేవలను తక్షణమే రద్దు చేసింది.
{{/usCountry}}తిరుమలలో లగేజీ డిపాజిట్ సేవలు పూర్తిగా ఉచితమని, ఏ కౌంటర్‌లోనూ ఎలాంటి రుసుములు వసూలు చేయరాదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అటువంటి రుసుములు వసూలు చేసే ఎవరికీ డబ్బు చెల్లించవద్దని టీటీడీ కోరింది. ఉల్లంఘనల గురించి తక్షణ చర్య కోసం 9866898630 టీటీడీ విజిలెన్స్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని భక్తులకు సూచించారు.