TTD : టీటీడీ కీలక నిర్ణయం.. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్, ఎస్‌ఎస్‌డీ టోకెన్ల రద్దు

TTD VIP Break Darshan : తిరుమల తిరుపతి దేవస్థానం అతి త్వరలో కీలక విషయాలను అమలు చేయనుంది. ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనుసరించిన విధానాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారు.

Published on: Apr 14, 2026, 09:50:33 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగానే తిరుమలలో రద్దీ ఉంటుంది. ఇక వేసవి సెలవులు మెుదలైన తర్వాత ఈ రద్దీ ఎక్కువ అవుతుంది. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు వేస్తోంది. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటుగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఫాలో చేసిన నిబంధనలు అమలు చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

కిందటి సంవత్సరాల డేటాను చూస్తే వేసవి సెలవుల్లో ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. మే, జూన్, జులై నెలల్లో ప్రతి నెల సగటున 23 నుంచి 24 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చారు. ఈ లెక్కలు పరిశీలించిన టీటీడీ వేసవి సెలవుల దృష్ట్యా.. వీఐపీ బ్రేక్, ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు వీఐపీ దర్శనాలకు రోజూ 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తున్నారు. ఆ సమయంలో 3800 వరకు వీఐపీలు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ మూడు గంటల సమయాన్ని సామాన్యులకు కేటాయిస్తే అనే అంశాన్ని పరిశీలించినప్పుడు కీలక విషయాన్ని గుర్తించారు. మూడు గంటల్లో సామాన్య భక్తులు ఏకంగా 15వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు.

ఈ లెక్కలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిశీలించింది. ఇందులో భాగంగా వేసవిలో వీఐపీ దర్శనాలను రద్దు చేయాలని అనుకుంటోంది. ఇక ఎస్ఎస్‌డీ విధానంలో దర్శనాలకు 22 నుంచి 23 గంటలు నిరీక్షించాలి. ఇలా దర్శనాల కేటగిరీలు అన్నింటినీ పక్కకు పెట్టి.. వైకుంఠ ఏకాదశి విధానం అమలు చేయాలని తిరుమల అధికారులు అనుకుంటున్నారు. ఇలా చేస్తే.. 8 నుంచి 12 గంటల వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రోజుకు సగటున 80 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించవచ్చు అని చెబుతున్నారు.

లగేజీ డిపాజిట్ కేంద్రం ఉద్యోగి తొలగింపు

నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై తిరుమలలోని లగేజీ డిపాజిట్ కేంద్రంలో పనిచేస్తున్న ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని తిరుమల తిరుపతి దేవస్థానం తొలగించింది. నరసింహ రెడ్డి అనే వ్యక్తి, లగేజీ డిపాజిట్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నందుకు యాత్రికుల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన టీటీడీ, అతని సేవలను తక్షణమే రద్దు చేసింది.

తిరుమలలో లగేజీ డిపాజిట్ సేవలు పూర్తిగా ఉచితమని, ఏ కౌంటర్‌లోనూ ఎలాంటి రుసుములు వసూలు చేయరాదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అటువంటి రుసుములు వసూలు చేసే ఎవరికీ డబ్బు చెల్లించవద్దని టీటీడీ కోరింది. ఉల్లంఘనల గురించి తక్షణ చర్య కోసం 9866898630 టీటీడీ విజిలెన్స్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని భక్తులకు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More