...
...
Next Story

క్వాలిటీ చెక్‌కు టీటీడీ కొత్త విధానం.. థర్డ్ పార్టీ సర్టిఫికేషన్‌ తప్పనిసరి చేస్తుందా?

తిరుమలకు అవసరమయ్యే వాటిని సేకరించే విషయంలో ఇకపై కొత్త విధానం తీసుకురావాలని టీటీడీ భావిస్తోందని తెలుస్తోంది. క్వాలిటీ చెక్ కోసం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ కోసం కూడా ఆలోచన చేసేందుకు చూస్తోంది.

Published on: Dec 15, 2025, 11:02:05 IST
Advertisement

తిరుమలలో పట్టు శాలువాలకు బదులుగా పాలిస్టర్‌ను ఉపయోగించినట్టుగా ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. అయితే బయట నుంచి సేకరణలో అక్రమాలను గుర్తించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనున్నుట్టుగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సేకరణ మాన్యువల్‌ను ప్రవేశపెట్టనుంది. అంతేకాదు బయటి ఏజెన్సీల నుండి కొనుగోలు చేసిన అన్ని సామగ్రికి థర్డ్ పార్టీ ధృవీకరణను తప్పనిసరి చేస్తుంది. ఇటీవల చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో జరిగిన టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

టీటీడీ
టీటీడీ

కల్తీ నెయ్యి, నకిలీ పట్టు దుపట్టాలకు సంబంధించిన కేసుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సేకరణ, నాణ్యత తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయాలని టీటీడీ భావిస్తోంది. నెయ్యి కల్తీ కేసుపై ప్రస్తుత దర్యాప్తులో సరఫరా గొలుసులో తీవ్రమైన లోపాలు వెల్లడయ్యాయని, నాణ్యత, జవాబుదారీతనం నిర్ధారించడానికి స్పష్టమైన, ఏకరీతి సేకరణ వ్యవస్థ అవసరాన్ని టీటీడీ ఆలోచన చేస్తోంది

సేకరణలో లొసుగులను నిలిపివేయడానికి సమగ్ర సేకరణ మాన్యువల్ అవసరమని ట్రస్ట్ బోర్డు భావించిందని ఓ అధికారి తెలిపారు. థర్డ్ పార్టీ సర్టిఫికేషన్‌ విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ నిబంధనలకు అనుగుణంగా స్పష్టంగా నిర్వచించిన విధానాలు, సరఫరా గొలుసులను బలోపేతం చేయాలని టీటీడీ భావించింది. కల్తీని, నాణ్యత లేని సామాగ్రిని అడ్డుకోవడం, ఆలయ సంబంధిత సేవలకు ఉపయోగించే పదార్థాలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం దీని లక్ష్యమని అధికారి తెలిపారు.

కొత్త మాన్యువల్ ట్రస్ట్.. టీటీడీ చేసే అన్ని కొనుగోళ్లకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఇది ఉత్పత్తి వివరణలు, నమూనా సేకరణ, నిర్వహణ, నాణ్యత తనిఖీలు, సరఫరా ఒప్పందాలు, డెలివరీ షెడ్యూల్‌లు, సరఫరాదారులకు సాంకేతిక, ఆర్థిక అర్హత ప్రమాణాలకు సంబంధించిన విధానాలను చెబుతుంది.

ఆలయ పూజలు, అన్నదానం, వసతి, ఇతర కార్యకలాపాల కోసం దాదాపు 300 రకాల సామాగ్రిని సేకరించడానికి టీటీడీ ప్రతి సంవత్సరం సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేస్తుంది. నెయ్యి ఒక్కటే వార్షిక వ్యయం దాదాపు రూ.70 కోట్లు. గిడ్డంగి సామర్థ్యం సరిపోకపోవడం, ఆధునిక నిల్వ పద్ధతులు లేకపోవడంపై టీటీడీ బోర్డు ఆలోచన చేస్తోంది. ఎందుకంటే ఇది జాబితా నిర్వహణ, మెటీరియల్ నాణ్యత రెండింటికీ ప్రమాదాలను కలిగిస్తుంది.

సంస్కరణల్లో భాగంగా క్లైమెట్ కంట్రోల్ స్టోరెజ్, శాస్త్రీయ జాబితా నిర్వహణ వ్యవస్థలు, ఉష్ణోగ్రత, తేమ, పరిశుభ్రత ఆటోమేటెడ్ పర్యవేక్షణ, డిజిటల్ ట్రాకింగ్ విధానాలు, అగ్ని మరియు ఆహార-భద్రత-అనుకూల మౌలిక సదుపాయాలతో కూడిన అదనపు గిడ్డంగి సౌకర్యాలను తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe