...
...
Next Story

అక్టోబర్ 7న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.. ఈ తేదీల్లో వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శనాలు ర‌ద్దు

అక్టోబర్ 7న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శనాలు ర‌ద్దు చేస్తున్నట్టుగా తెలిపింది.

Published on: Oct 6, 2026, 17:37:14 IST
Advertisement

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7వ తేది ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శనాలు ర‌ద్దు చేయనున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు తిరుమ‌ల‌లో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుండ‌టంతో పాటు పెర‌టాసి మాసం చివరి వారం కావ‌డంతో భ‌క్తుల అధిక ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంది. ఈ ప‌ది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖుల‌కు మిన‌హా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల త‌ల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ ద‌ర్శనాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

వీఐపీ బ్రేక్ ద‌ర్శనాల‌కు సంబంధించి అక్టోబ‌ర్ 10వ తేది నుండి 19వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శనాల‌కు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌రు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని భ‌క్తులు త‌మ తిరుమ‌ల యాత్రను రూపొందిచుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.

దేవి నవరాత్రి ఉత్సవాలు

నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరియమాణిక్యస్వామి, శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు దేవి నవరాత్రి ఉత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా పది రోజులపాటు అమ్మవారు వివిధ దివ్య అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చి, భక్తులపై కరుణాకటాక్షాలు ప్రసరించనున్నారు. అక్టోబరు 11న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

అమ్మవారి అలంకారాల వివరాలు

అక్టోబరు 12 – శ్రీ బాలా త్రిపురసుందరి

అక్టోబరు 13 – శ్రీ లలితా త్రిపురసుందరి

అక్టోబరు 14 – శ్రీ మహాలక్ష్మీదేవి

అక్టోబరు 15 – శ్రీ అన్నపూర్ణాదేవి

అక్టోబరు 16 – శ్రీ గాయత్రీదేవి

అక్టోబరు 17 – శ్రీ సరస్వతీదేవి

అక్టోబరు 18 – శ్రీ దుర్గాదేవి

అక్టోబరు 19 – శ్రీ మహిషాసురమర్ధిని

అక్టోబరు 20 – శ్రీ రాజరాజేశ్వరీదేవి

ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం, ఆస్థానం, సాయంత్రం లలితా సహస్రనామార్చన, కుంకుమ పూజ, పంచహారతి నిర్వహించనున్నారు. దేవీ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత పవిత్రమైన సందర్భమని, ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివ్య అలంకారాల్లో కొలువుదీరే అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని, అమ్మవారి కృపాకటాక్షాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks