తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అలిపిరి మెట్లమార్గం ఏడో మైలు వద్ద కొత్త ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రసిద్ధ మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ సౌకర్యం ఏర్పాటు అయింది. ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ నాయుడు ఈ కేంద్రం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులు వచ్చిన సమయంలో ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.

దీని వలన అవసరమైన వారికి వైద్య సేవలు త్వరగా లభిస్తాయని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు. అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కేంద్రంలో టీటీడీ, అపోలో హాస్పిటల్స్ నుండి వైద్యులు, శిక్షణ పొందిన పారామెడికల్ బృందం మద్దతుతో పనిచేస్తారు. అందుబాటులో ఉన్న ముఖ్యమైన వైద్య పరికరాలలో ఈసీజీ యంత్రం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, నెబ్యులైజర్, వివిధ రకాల మందులు ఉన్నాయి. ప్రారంభోత్సవానికి టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అదనపు కార్యనిర్వాహకాధికారి వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు కూడా హాజరయ్యారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చాలా వరకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని వెంకయ్య చౌదరి చెప్పారు. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్యూలైన్లలో పలు మార్పులు చేపట్టామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీటి సౌకర్యం, క్యూలైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
చలికాలం కావడంతో క్యూలైన్లలోని అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు చల్లబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు వెంకయ్య చౌదరి. అదేవిధంగా భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భక్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన సదుపాయాలను వినియోగించుకునేందుకు వివిధ భాషల్లో సూచిక బోర్డులను కూడా క్యూలైన్లలో మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ టీటీడీ క్యూలైన్లలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో స్వామివారిని దర్శంచుకోవాలని తెలియజేశారు.
{{/usCountry}}చలికాలం కావడంతో క్యూలైన్లలోని అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు చల్లబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు వెంకయ్య చౌదరి. అదేవిధంగా భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భక్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన సదుపాయాలను వినియోగించుకునేందుకు వివిధ భాషల్లో సూచిక బోర్డులను కూడా క్యూలైన్లలో మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ టీటీడీ క్యూలైన్లలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో స్వామివారిని దర్శంచుకోవాలని తెలియజేశారు.
{{/usCountry}}