తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. వైభవంగా ఏకాదశి వేడుకలు

తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి నామస్మరణతో తిరుమల కొండలు మార్మోగిపోతున్నాయి. ఏకాదశి వేడుకలు తిరుగిరులలో వైభవంగా జరుగుతున్నాయి.

Published on: Dec 30, 2025, 09:24:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు మెుదలయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఇవాళ ప్రముఖులు సైతం శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. తిరుమల శ్రీవారి నామస్మరణతో మార్మోగిపోతోంది.

తిరుమలలో వైభవంగా ఏకాదశి వేడుకలు
తిరుమలలో వైభవంగా ఏకాదశి వేడుకలు

వైకుంఠ ఏకాదశి తిరుమలలో అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగలలో ఒకటి, వైకుంఠ ద్వారం గుండా వెళితే పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సాంప్రదాయకంగా వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి నాడు మాత్రమే తెరుస్తారు. అయినప్పటికీ భారీగా భక్తులను రద్దీని నిర్వహించడానికి 2020 డిసెంబర్‌లో వ్యవధిని 10 రోజులకు పొడిగించారు. అప్పటి నుండి ఈ పద్ధతి కొనసాగుతోంది.

టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ప్రత్యేక దర్శనం, రద్దీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసింది. దర్శన షెడ్యూల్ ప్రకారం.. మొదటి మూడు రోజులలో వైకుంఠ ద్వార దర్శనం ముందుగా జారీ చేసిన టోకెన్లను కలిగి ఉన్న భక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది. జనవరి 2 నుండి జనవరి 8 వరకు ముందస్తు బుకింగ్‌లు లేకుండా వచ్చే భక్తులు పాల్గొనడానికి వీలుగా, ఎటువంటి దర్శన టిక్కెట్లు లేకుండా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

టైంస్లాట్

మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైంస్లాట్ టోకెన్ పొందిన భక్తులు కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి అనుమతి ఇస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల టోకెన్ ఉన్న భక్తులు ఏటీజీహెచ్ నుంచి అనుమతి, 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం ద్వారా అనుమతి ఇస్తారు. భక్తులు తమ ఆధార్ కార్డుతో పాటు ఈ డిప్ ద్వారా కేటాయించిన టోకెన్ కాపీని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) ద్వారా వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కొండ గుడి వద్దకు చేరుకున్న సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు రేవంత్ రెడ్డికి వేద ఆశీస్సులు అందించి తీర్థం, ప్రసాదం అందజేశారు. పలువురు ప్రముఖులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం చేసిన ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. భ‌క్తులంద‌రికీ సౌక‌ర్యవంతంగా ద‌ర్శనం క‌ల్పించేందుకు ప్రణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. పోలీసులు, విజిలెన్స్, టీటీడీ యంత్రాంగం స‌మ‌న్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ ద్వారా ఎప్పటిక‌ప్పుడు భ‌క్తుల ర‌ద్దీని ప‌ర్యవేక్షిస్తూ వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలియ‌జేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More