100 Days Of Lies OTT: ఓటీటీలోకి కొరియన్ స్పై రొమాన్స్ థ్రిల్లర్- 100 డేస్ ఆఫ్ లైస్ టీజర్ రిలీజ్-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

100 Days Of Lies OTT Teaser Released: కొరియన్ డ్రామా (K-Drama) ప్రియులకు టీవీఎన్ నెట్‌వర్క్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ వూ' దర్శకుడు యూ ఇన్ షిక్ తెరకెక్కిస్తున్న సరికొత్త స్పై రొమాన్స్ థ్రిల్లర్ 100 డేస్ ఆఫ్ లైస్ ఫస్ట్ టీజర్‌ను విడుదల చేశారు.

Published on: Jul 3, 2026, 06:26:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

100 Days Of Lies OTT Teaser Released: తెలుగురాష్ట్రాల్లో కొరియన్ డ్రామాలకు ఉన్న ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 'డాక్టర్ రొమాంటిక్', 'ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ వూ' వంటి విలక్షణమైన ఫీల్ గుడ్ డ్రామాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా కనెక్ట్ అయిన ప్రముఖ సౌత్ కొరియన్ డైరెక్టర్ యూ ఇన్ షిక్ ఈసారి సరికొత్త జోనర్‌ను ఎంచుకున్నారు.

ఓటీటీలోకి కొరియన్ స్పై రొమాన్స్ థ్రిల్లర్- 100 డేస్ ఆఫ్ లైస్ టీజర్ రిలీజ్-స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి కొరియన్ స్పై రొమాన్స్ థ్రిల్లర్- 100 డేస్ ఆఫ్ లైస్ టీజర్ రిలీజ్-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

100 డేస్ ఆఫ్ లైస్ టీజర్ రిలీజ్

ప్రేమ, యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కలగలిపిన ఓ పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్ '100 డేస్ ఆఫ్ లైస్' (100 Days of Lies) ఫస్ట్ టీజర్‌ను జూలై 2న కొరియన్ నెట్‌వర్క్ టీవీఎన్ విడుదల చేసింది. ఈ గ్లోబల్ అప్‌డేట్‌తో అక్టోబర్‌లో రాబోయే ఈ ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

1932 నాటి గియాంగ్ ‌సియాంగ్ నేపథ్యంలో కథ

ఈ కథ 1932 నాటి గియాంగ్‌ సియాంగ్ (ప్రస్తుత సియోల్ నగరం) బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. కొరియాను జపాన్ పాలిస్తున్న ఆ కాలంలో జరిగే ఉత్కంఠభరితమైన పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నారు. ప్రముఖ నటి కిమ్ యూ జంగ్.. 'లీ గా క్యోంగ్' అనే నైపుణ్యమున్న గజదొంగ (పిక్‌పాకెటర్) పాత్రలో నటిస్తోంది. ఎలాగైనా డబ్బు సంపాదించి అమెరికా పారిపోవాలనేది ఆమె ఏకైక లక్ష్యం.

అయితే, కొరియా స్వాతంత్ర్యం కోసం పోరాడే 'గుగుక్‌దాన్' అనే విప్లవ బృందం ఆమెను ఒక ప్రమాదకరమైన మిషన్ కోసం ఎంపిక చేయడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. జపాన్ ప్రభుత్వ కార్యాలయంలో ఒక అనువాదకురాలిగా (ట్రాన్స్‌లేటర్) 100 రోజుల పాటు అండర్‌కవర్ ఏజెంట్‌గా పనిచేయడానికి ఆమె ఒప్పుకుంటుంది.

రహస్యాల వెనుక ఉన్న రాకుమారుడు

అక్కడే లీ గా క్యోంగ్‌కు కిమ్ టే వూంగ్ (గాట్7 బ్యాండ్ ఫేమ్ పార్క్ జిన్‌యంగ్) పరిచయమవుతాడు. జపాన్ డైరెక్టర్ జింగ్ దత్తపుత్రుడైన ఇతనికి కొరియన్, జపనీస్, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉంటుంది. పదేళ్ల తర్వాత విదేశాల నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ఇతను పైకి ఎంతో హోదా ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ, ఇతని వెనుక కూడా ఎన్నో భయంకరమైన రహస్యాలు దాగి ఉంటాయని టీజర్ చూస్తే అర్థమవుతుంది.

"నమ్మకం ఎంతో బలహీనమైనది, ప్రమాదం ప్రతి మలుపులోనూ పొంచి ఉంటుంది. చివరకు ప్రేమే అన్నిటికంటే పెద్ద రిస్క్‌గా మారుతుంది" అని టీజర్ ముగింపులో వచ్చే లీ గా క్యోంగ్, కిమ్ టే వూంగ్ ల మొదటి కలయిక సీన్ స్పష్టం చేస్తోంది.

ఇతర నటీనటులు

ఈ సిరీస్‌లో 'గుగుక్‌దాన్' స్నైపర్‌గా కిమ్ హ్యున్ జూ, స్వాతంత్ర్య ఉద్యమానికి రహస్యంగా మద్దతు ఇచ్చే అమెరికన్ జర్నలిస్ట్‌గా లీ మూ సేంగ్, విప్లవకారులకు అతి పెద్ద ముప్పుగా మారే జపనీస్ క్రూర అధికారిగా జిన్ సన్ క్యు కీలక పాత్రలు పోషించారు. 'డూ యూ లైక్ బ్రహ్మ్స్?' ఫేమ్ రైటర్ ర్యు బో రి ఈ చిత్రానికి కథను అందించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ రిలీజ్

ఈ 16 ఎపిసోడ్‌ల సిరీస్ అక్టోబర్ నెల నుంచి శని, ఆదివారాల్లో టీవీఎన్ ప్రైమ్‌టైమ్ స్లాట్‌లో ప్రసారం కానుంది. కొరియాతో పాటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ వీక్షకుల కోసం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో 100 డేస్ ఆఫ్ లైస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్‌కు సరిగ్గా 100 రోజుల ముందే ఈ టీజర్‌ను లాంచ్ చేసి మేకర్స్ కౌంట్‌డౌన్ ప్రారంభించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More