2021లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న తెలుగు సినిమా ఒకటి ఇన్నాళ్లకు నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆ సినిమా పేరు కూడా డిఫరెంట్ గా ఉంది. అదే 11:11 మూవీ. ఈ 11:11 సినిమా ఇవాళ (డిసెంబర్ 23) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు రాజీవ్ హీరో. ఇదో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది.
11:11 ఓటీటీ

ఓటీటీలోకి మంగళవారం ఓ తెలుగు సినిమా వచ్చేసింది. 11:11 మూవీ ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో రిలీజైంది. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది.
నాలుగేళ్లకు
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు రాజీవ్ హీరోగా 2021లో 11:11 షూటింగ్ ప్రారంభమైంది. అప్పటికే రాజీవ్ కొన్ని సినిమాలు చేశాడు. ఈ 11:11 మూవీ ఫస్ట్ లుక్ ను అప్పట్లో చిరంజీవి లాంఛ్ చేశారు. ఇందులో వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ బ్యానర్లపై దీన్ని నిర్మించారు. ఈ 11:11 సినిమాకు కిట్టు నల్లూరి డైరెక్టర్.
సైలెంట్ గా
థియేటర్లో రిలీజ్ కోసం తెరకెక్కించిన 11:11 మూవీ వివిధ కారణాల వల్ల విడుదల కాలేదు. థియేటర్లో రిలీజ్ చేయడం కష్టంగా మారింది. ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇందులో రాజీవ్, వర్ష విశ్వనాథ్ తో పాటు సదన్, రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజ శ్రీ తదితరులు నటించారు.
11:11 స్టోరీ
డిఫరెంట్ స్టోరీతో ఈ 11:11 సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో రాజీవ్, హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. ఈ ఇద్దరు ప్రేమించుకుంటారు. హ్యాపీగా తమ లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో మధ్యలోకి మూడో వ్యక్తి వస్తాడు.
{{/usCountry}}డిఫరెంట్ స్టోరీతో ఈ 11:11 సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో రాజీవ్, హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. ఈ ఇద్దరు ప్రేమించుకుంటారు. హ్యాపీగా తమ లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో మధ్యలోకి మూడో వ్యక్తి వస్తాడు.
{{/usCountry}}లవర్స్ మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తి హత్య జరుగుతుంది. దీంతో సినిమా ఒక్కసారిగా థ్రిల్లింగ్ మూమెంట్ ను అందిస్తుంది. మరి ఆ హత్య ఎవరు చేశారు? వచ్చిన మూడో మనిషి ఎవరు? అనేది ఈ 11:11 మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.