సంక్రాంతి 2026 సందడి థియేటర్లలో ఇంకా కొనసాగుతోంది. పండగ సందర్భంగా వచ్చిన సినిమాలను ఆడియన్స్ ఆదిరిస్తూనే ఉన్నారు. ఈ సంక్రాంతికి తెలుగులో ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ది రాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ణప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఇందులో ఏది సంక్రాంతి విన్నరో చూసేద్దాం.
ది రాజా సాబ్

ప్రభాస్ ఫస్ట్ టైమ్ నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజా సాబ్. ఇందులో వింటేజీ లుక్ లో డ్యాన్స్, ఫైట్స్ తో అదరగొట్టాడు రెబల్ స్టార్. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. కానీ మిక్స్ డ్ టాక్ కారణంగా వసూళ్లు పడిపోయాయి. జనవరి 9న రిలీజైన రాజా సాబ్ సక్నిల్క్ ప్రకారం 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.196.65 కోట్ల కలెక్షన్లు సాధించింది. రూ.400 కోట్ల బడ్జెట్ ప్రకారం చూస్తే రాజా సాబ్ కు నెగెటివ్ రిజల్ట్ దక్కే అవకాశముంది.
మన శంకర వర ప్రసాద్ గారు
అసలు సిసలైన సంక్రాంతి 2026 విన్నర్ మన శంకర వర ప్రసాద్ గారు.. ఇదే ట్రేడ్ పండితులు అంటున్న మాట. జనవరి 12న రిలీజైన మెగాస్టార్ చిరంజీవి సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఆరు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. చిరు కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. ఈ చిత్రం ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
భర్త మహాశయులకు విజ్ణప్తి
రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న భర్త మహాశయులకు విజ్ణప్తి మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. దీంతో కలెక్షన్లపై గట్టి ప్రభావమే పడింది. జనవరి 13న రిలీజైన భర్త మహాశయులకు విజ్ణప్తి సినిమా ఇప్పటివరకూ రూ.12 కోట్ల గ్రాస్ మాత్రమే సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓవరాల్ గా నిరాశపర్చే అవకాశముంది.
అనగనగా ఒక రాజు
{{/usCountry}}రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న భర్త మహాశయులకు విజ్ణప్తి మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. దీంతో కలెక్షన్లపై గట్టి ప్రభావమే పడింది. జనవరి 13న రిలీజైన భర్త మహాశయులకు విజ్ణప్తి సినిమా ఇప్పటివరకూ రూ.12 కోట్ల గ్రాస్ మాత్రమే సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓవరాల్ గా నిరాశపర్చే అవకాశముంది.
అనగనగా ఒక రాజు
{{/usCountry}}ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన మరో సంక్రాంతి సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ కామెడీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాకు లైన్ కడుతున్నారు. జనవరి 14న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ దక్కించుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
నారీ నారీ నడుమ మురారీ
శర్వానంద్ కు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. నారీ నారీ నడుమ మురారీ సినిమాతో అతను ఈ సంక్రాంతికి హిట్ అందుకున్నాడు. జనవరి 14న సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది ఈ మూవీ. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్లకు పైగా వసూళ్లతో సాగుతోంది.