...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆ గ్యాంగ్ రేపు 3- జాంబీ డ్రగ్, బోల్డ్ కంటెంట్‌తో!

Aa Gang Repu 3 OTT Release Today: ఓటీటీలోకి ఇవాళ నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆ గ్యాంగ్ రేపు 3. గ్యాంగ్ రేపు షార్ట్ ఫిల్మ్స్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో జాంబీ డ్రగ్ చుట్టూ సాగుతుంది. బోల్డ్ కంటెంట్‌తో సాగే ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Apr 16, 2026, 11:58:47 IST
Advertisement

Aa Gang Repu 3 OTT Streaming From Today: ఓటీటీలో ఈ వారం కూడా ఎన్నో విభిన్న జోనర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో తెలుగు కంటెంట్ సినిమాలు కూడా ఆకట్టుకునేలా చాలా ఉన్నాయి. వీటిలో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఓ తెలుగు సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

జాంబీ డ్రగ్-ప్రాస్టిట్యూట్

ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆ గ్యాంగ్ రేపు 3- జాంబీ డ్రగ్, బోల్డ్ కంటెంట్‌తో!
ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆ గ్యాంగ్ రేపు 3- జాంబీ డ్రగ్, బోల్డ్ కంటెంట్‌తో!

ఆ సినిమానే ఆ గ్యాంగ్ రేపు 3. ఓటీటీలోకి నేరుగా ఇవాళ (ఏప్రిల్ 16) ఆ గ్యాంగ్ రేపు 3 మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో జాంబీ డ్రగ్, ఓ ప్రాస్టిట్యూట్, విటులు, రౌడీ గ్యాంగ్ చుట్టూ సాగుతుంది. బోల్డ్ కంటెంట్ కూడా సినిమాలో బాగానే ఉంది. ఇలా జాంబీ డ్రగ్, రౌడీ గ్యాంగ్ వంటి అంశాలతో బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కించిన సినిమానే ఆ గ్యాంగ్ రేపు 3.

అయితే, ఇంతకుముందు ఆ గ్యాంగ్ రేపు అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో తెగ హిట్ టాక్ తెచ్చుకుంది. యూట్యూబ్‌లో 45 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన ఆ గ్యాంగ్ రేపు చిత్రానికి సీక్వెల్‌గా ఆ గ్యాంగ్ రేపు 2 కూడా వచ్చేసింది.

సీక్వెల్‌గా ఆ గ్యాంగ్ రేపు 3

ఈ చిత్రానికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభించింది. ఇలా వరుసగా రెండు షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో వీటికి సీక్వెల్‌గా ఆ గ్యాంగ్ రేపు 3 అనే మరో షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఎప్పుడో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఆ గ్యాంగ్ రేపు 3 నేడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఇంతకు ముందు యోగీ కుమార్ దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ లవ్‌ యూ టూ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. అలాగే, ఆ గ్యాంగ్ రేపు 3ని కూడా ఓటీటీలోకి నేరుగా తీసుకొచ్చారు. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి ఆహాలో ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

కాగా, ఆ గ్యాంగ్ రేపు 3 సినిమాలో నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి హ్యాండ్ హెల్డ్ స్టైల్ చిత్రీకరణ చేసిన సినిమాటోగ్రాఫర్ నాని ఐనవెల్లి విజువల్స్ అందించారు. అయితే, తెలుగులో బోల్డ్ కంటెంట్‌తో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఆహాలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ గ్యాంగ్ రేపు 3 బెస్ట్ ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks