OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 8 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 3 మరింత ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
OTT Telugu Movies: వేసవి సెలవులు మొదలయ్యాయి. దానికి తోడు ఓటీటీ ప్రియుల కోసం సరికొత్త చిత్రాలు రిలీజ్ అయ్యాయి. గత వారం తెలుగులో ఏకంగా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. ఈటీవీ విన్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ ఓటీటీలలో సందడి చేస్తున్న ఆ తెలుగు సినిమాలపై లుక్కేద్దాం.
OTT Release Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అవి అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ఓటీటీ మూవీస్‌పై లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
అనకొండ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- ఏప్రిల్ 6
థ్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 10
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది బాయ్స్ ఫైనల్ సీజన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో డార్క్ కామెడీ యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 8
జియో హాట్‌స్టార్ ఓటీటీ
థాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ తమిళ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 10
ఈటీవీ విన్ ఓటీటీ
నిలవే (తెలుగు బోల్డ్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 9
చిట్టి తల్లి (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 12
ఆహా ఓటీటీ
డార్క్ నైట్ (తెలుగు హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఏప్రిల్ 9
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
వైల్డ్‌క్యాట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 10
ఓటీటీలోకి తెలుగులో 8
ఇలా గత వారం (ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 12) వరకు తెలుగు భాషలో ఏకంగా 8 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో అన్ని సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, వీటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 3 సినిమాలు మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఆ మూడు సినిమాలపై ఓ లుక్కేద్దాం.
నిలవే (Nilaave): ఏప్రిల్ 9 నుంచి ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇదొక బోల్డ్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. నేటి తరం ప్రేమ కథలు, అందులో ఉండే సంక్లిష్టతలను ఈ సినిమాలో హృద్యంగా చూపించారు. ముఖ్యంగా సంగీతానికి ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో స్పెషల్‌గా మారింది.
చిట్టి తల్లి (Chitti Talli): ఏప్రిల్ 12న ఓటీటీ రిలీజ్ అయిన మరో తెలుగు సినిమా 'చిట్టి తల్లి'. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ సాగే ఈ కథ చిన్న సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి ఎంపిక అవుతుందని చెప్పవచ్చు. పక్కా లోకల్ నేటివిటీతో సాగే ఇటువంటి చిత్రాలకు మన దగ్గర ఎప్పుడూ ఆదరణ ఉంటుంది.
ఆహాలో భయపెట్టే 'డార్క్ నైట్'
తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలను కొనుగోలు చేస్తూంటుంది. అందులో భాగంగా ఏప్రిల్ 9న 'డార్క్ నైట్' అనే ఓటీటీ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని విడుదల చేసింది. థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా, వీకెండ్‌లో ఏదైనా హారర్ సినిమా చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


